YSRCP : ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామం.. వైసీపీ తీర్థం పుచ్చుకున్న కీలక నేత..

ABN , First Publish Date - 2023-05-10T20:13:29+05:30 IST

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది ఉండగానే నేతల జంపింగ్‌లు షురూ అయ్యాయి. ఏ పార్టీ అయితే తమను ఆదరిస్తుంది.. ఎక్కడైతే తమకు టికెట్ వస్తుందో అని లెక్కలేసి మరీ ...

YSRCP : ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామం.. వైసీపీ తీర్థం పుచ్చుకున్న కీలక నేత..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది ఉండగానే నేతల జంపింగ్‌లు షురూ అయ్యాయి. ఏ పార్టీ అయితే తమను ఆదరిస్తుంది.. ఎక్కడైతే తమకు టికెట్ వస్తుందో అని లెక్కలేసి మరీ నేతలు పార్టీలు మారుతున్నారు. ఇప్పటికే పలువురు ముఖ్యనేతలు అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి.. ప్రతిపక్ష పార్టీల నుంచి అధికార వైసీపీలోకి చేరిపోతున్నారు. తాజాగా ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ (Congress) హయాంలో ఓ వెలుగు వెలిగిన గుంటూరు జిల్లా సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి (ExMLA Yarram Venkateswara Reddy) వైసీపీ తీర్థం (YSR Congress) పుచ్చుకున్నారు. బుధవారం నాడు తన ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో కలిసి తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లిన యర్రం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు బీజేపీలో నేత సూరిబాబు (Suri Babu) కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఇద్దరికీ పార్టీ కండువా కప్పిన జగన్.. సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ ఇద్దరి చేరిక సమయంలో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) , నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు (Lavu Sri Krishna Devarayalu), టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy), ఏపీఎండీసీ డైరెక్టర్‌ గాదె సుజాత కూడా ఉన్నారు.

Yerraam.jpg

ఎవరీ యర్రం..!?

యర్రం వెంకటేశ్వర రెడ్డి.. గుంటూరు జిల్లా రాజకీయాల్లో పేరుగాంచిన నేత. సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత కొన్నిరోజులపాటు రాజకీయాల్లో యర్రం యాక్టివ్‌గా లేరు. అయితే 2019 ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) సమక్షంలో పార్టీలో చేరారు. యర్రంకు జనసేన పార్టీ టికెట్ఇవ్వగా కేవలం 9,279 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2004లో 24 ,410 ఓట్లు 2009లో 7,147 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించిన యర్రం.. 2019 ఎన్నికల్లో ఆ మెజార్టీ అన్ని ఓట్లు కూడా రాకపోవడంతో అభిమానులు, అనుచరులు ఢీలా పడిపోయారు. అయితే అప్పట్నుంచీ జనసేన తరఫున కూడా పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. దీంతో మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కావాలని అనుచరులు, అభిమానుల కోరిక మేరకు ఇవాళిలా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే.. ఈయన చేరికలో మంత్రి అంబటి, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది.

Yerram-Janasena.jpg

వైసీపీకి మరింత బలం..

యర్రం పార్టీలో చేరిన తర్వాత నేతలంతా మీడియా మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. యర్రం, సూరిబాబుల చేరికతో పల్నాడులో వైసీపీకి మరింత బలాన్నిస్తుందన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి (YS Family) ఎర్రం వెంకటేశ్వరరెడ్డి సన్నిహితుడు. నామినేషన్లకు ఒకరోజు ముందు చంద్రబాబుతో కుమ్మక్కై జనసేన నుంచి మనోహర్ బీఫాం ఇప్పించారు. జనసేన (Janasena) తరపున యర్రంకు టికెట్ ఇప్పించి చివరకు అభాసుపాలు చేశారు. వైసీపీలో చేరినా ఇరువురికీ సరైన గౌరవం, ప్రాధాన్యత ఇస్తాం. పార్టీలో గౌరవం తక్కువ కాకుండా చూసే బాధ్యత మాదిఅని అంబటి చెప్పుకొచ్చారు. మరోవైపు ఎంపీ లావు మాట్లాడుతూ.. ఈ ఇద్దరి చేరికతో వైసీపీ మరింత బలోపేతం అవుతుందని.. వీరి సేవలను అన్నివిధాలుగా వినియోగించుకుంటామని తెలిపారు.

Ambati-Rambabu.jpg

పార్టీలో చేరిన తర్వాత..

వైసీపీ తీర్థం పుచ్చుకున్నాక యర్రం వెంకటేశ్వరరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.2019లో జనసేన తరపున బీఫాం తీసుకుని పోటీ చేశాను. నాలుగేళ్లయినా జనసేన వారు నన్ను టచ్ కూడా చేయలేదు. పార్టీని బలోపేతం చేసే ఆలోచన జనసేనకు లేదు. పార్టీలో చేరాలని అంబటి రాంబాబు కోరడంతో పార్టీలో చేరాను. నేను ఎక్కడ్నుంచీ పోటీచేయను.. పోటీచేసే ఆలోచన కూడా నాకు లేదు. సత్తెనపల్లిలో వైసీపీ తరపున ఎవరిని నిలబెట్టినా వారి గెలుపు కోసం నా వంతు సహకరిస్తానుఅని యర్రం చెప్పుకొచ్చారు. మరోవైపు.. సూరిబాబు మాట్లాడుతూ.. వైసీపీ నేతలు పదే పదే కోరడంతో పార్టీలో చేరానన్నారు. పేదవాడి సంక్షేమం కోసం కృషి చేస్తోన్న పార్టీ వైసీపీ అని తెలిపారు. తాను ఏదో ఆశించి పార్టీలో చేరలేదని.. వచ్చే ఎన్నికల్లో సత్తెన పల్లిలో రాంబాబు విజయానికి కృషి చేస్తానని సూరిబాబు స్పష్టం చేశారు.

మొత్తానికి చూస్తే.. నిన్న మొన్నటి వరకూ అంబటికి టికెట్‌కు ఇచ్చే పరిస్థితుల్లో వైసీపీ అధిష్టానం లేదని.. ఆ స్థానంలో వేరే వ్యక్తిని.. వైఎస్ జగన్ బరిలోకి దింపుతారని రూమర్స్ వచ్చాయి. అయితే.. యర్రం వైసీపీలో చేరికతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది కానీ.. ఆయన మాత్రం తానెక్కడ్నుంచీ పోటీచేసే పరిస్థితి అయితే లేదని తేల్చిచెప్పేశారు. అంతేకాదు సత్తెనపల్లి నుంచి ఎవరు పోటీచేసినా తన వంతుగా సహకరిస్తానని కూడా యర్రం తెలపడంతో అంబటి అభిమానులు, అనుచరులు ఆనందంలో మునిగితేలుతున్నారట. మరి ఎన్నికల ముందు ఏం జరుగుతుందో ఏంటో వేచి చూడాల్సిందే మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Big Breaking : వైఎస్ వివేకా హత్య కేసులో కీలక మలుపు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన సునీతారెడ్డి

******************************

Jaganannaku Chebudam : 1902కు కాల్ చేస్తే డైరెక్టుగా వైఎస్ జగనే మాట్లాడుతారని అనుకుంటున్నారా.. అయితే మీ కంటే..!

******************************

Nellore Politics : నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఊహించని పరిణామం.. టీడీపీలో చేరేందుకు ఎమ్మెల్యేకు లైన్ క్లియర్..!

******************************

Telangana Election 2023 : రేవంత్ మాస్టర్ ప్లాన్.. ప్రియాంక పర్యటన ముగిసిన గంటల వ్యవధిలోనే.. ఇదేగానీ జరిగితే..!!

******************************

Updated Date - 2023-05-10T20:18:45+05:30 IST