Nellore Politics : నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఊహించని పరిణామం.. టీడీపీలో చేరేందుకు ఎమ్మెల్యేకు లైన్ క్లియర్..!

ABN , First Publish Date - 2023-05-09T19:10:05+05:30 IST

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో (Nellore Politics) ఊహించని పరిణామాలు చోటుచేసుకోనున్నాయా..? టీడీపీలో (Telugudesam) చేరేందుకు ఎమ్మెల్యేకు (MLA) లైన్ క్లియర్ అయ్యిందా..? 40 ఏళ్లుగా ఒకరంటే ఒకరు పడని..

Nellore Politics : నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఊహించని పరిణామం.. టీడీపీలో చేరేందుకు ఎమ్మెల్యేకు లైన్ క్లియర్..!

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో (Nellore Politics) ఊహించని పరిణామాలు చోటుచేసుకోనున్నాయా..? టీడీపీలో (Telugudesam) చేరేందుకు ఎమ్మెల్యేకు (MLA) లైన్ క్లియర్ అయ్యిందా..? 40 ఏళ్లుగా ఒకరంటే ఒకరు పడని నేతలు కలయిక వెనుక ఆంతర్యమేంటి..? ఇదేగానీ జరిగితే వైసీపీకి (YSR Congress) బిగ్ షాక్ తగిలినట్టేనా..? అంటే తాజా రాజకీయ పరిణామాలను చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమయ్యే ఛాన్స్ ఉందని జిల్లా నేతలు చెబుతున్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే.. జిల్లాలో ఏం జరగబోతోంది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

ఇదీ అసలు కథ..

ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట. 2019 ఎన్నికల్లో జిల్లాలో జగన్ పార్టీ క్లీన్ స్వీప్ చేసేసింది. ఎన్నికలకు ఇంకా ఏడాది కాకమునుపే జిల్లా వైసీపీలో పరిస్థితులన్నీ మారిపోయాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటేశారని.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sridhar Reddy), వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy), ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Mekapati Chandrasekhareddy) ఈ ముగ్గురిపై వైసీపీ అదిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ ఘటన తర్వాత జిల్లాలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా.. మేకపాటి కుటుంబానికి (Mekapati Family) ఉమ్మడి జిల్లాలో మంచి గుర్తింపు ఉంది. ఒకప్పుడు జిల్లా రాజకీయాలను మేకపాటి కుటుంబం శాసించిందని స్థానికులు చెబుతుంటారు. అయితే మేకపాటి చంద్రశేఖర్ వ్యవహారంతో ఆ ఫ్యామిలీకి చెడ్డ పేరు వచ్చిందని అభిమానులు, అనుచరులు అసంతృప్తికి లోనవుతున్న పరిస్థితి. వాస్తవానికి ఈ ముగ్గురు టీడీపీలో చేరుతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటి వరకూ భవిష్యత్ కార్యాచరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మిగిలిన ఇద్దరి సంగతేంటో తెలియదు కానీ.. మేకపాటి మాత్రం దాదాపు కీలక అడుగే ముందుకేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అతి త్వరలోనే ఆయన తెలుగుదేశం కండువా కప్పుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

Mekapati.jpg

ఒక్కటయ్యారు..!

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా దశాబ్దాల కాలంపాటు కంభం విజయరామిరెడ్డి (Kambham Vijayarami Reddy)- మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. ఒకరికొకరు ఎదురుపడితే కథ వేరేగా ఉండేది. ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు వేదికగా కంభం-మేకపాటి మధ్య ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి కూడా. ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఏళ్ల తరబడి బద్ధ శత్రువులుగా ఉన్న ఈ ఇద్దరూ ఎక్కడైతే ఇంతవరకూ సవాళ్లు విసురుకున్నారో అక్కడే ఒక్కటయ్యారు. కలిసి కూర్చోని మాట్లాడుకున్నారు.. భవిష్యత్తు రాజకీయాలపై లోతుగా చర్చించుకున్నారు. చివరగా నియోజక అభివృద్ధి కోసం ఒకేథాటిపై నడవాలని ఈ ఇద్దరూ నిర్ణయించుకున్నారు. దీంతో మేకపాటి టీడీపీలో చేరిక దాదాపు ఖాయమైనట్టేనని తెలిసిపోతోంది. సిట్టింగ్ స్థానం నుంచి టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని ఒకరికొకరు మాట్లాడుకున్నారట. ఎక్కడైతే ఈ ఇద్దరూ ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారో.. ఎక్కడైతే ఈ ఇద్దరూ వేర్వేరు పార్టీల తరఫున ఎన్నికల ప్రచారం చేశారో అదే దత్తలూరు సెంటర్‌‌లో ఒక్కటవ్వడంతో ఇరువురి అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు.

Mekapati-and-kambam.jpg


ఏం జరుగుతుందో..!

అటు కంభం, ఇటు మేకపాటి ఇద్దరూ రాజకీయాల్లో ఆరితేరిన వారే. ఉదయగిరి నియోజకవర్గం నుంచి విజయరామిరెడ్డి 1994లో ఇండిపెండెంట్‌గా, 1999లో టీడీపీ తరఫున పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వాత ఈయన పలుమార్లు పోటీచేసినా విజయం వరించలేదు. ప్రస్తుతం టీడీపీ సీనియర్ నేతగా, జిల్లాకు చెందిన కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. ఇక మేకపాటి విషయానికొస్తే.. 2004, 2009లో కాంగ్రెస్ తరఫున, 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేసి గెలుపొందారు. ఈ ఇద్దరూ రాజకీయ ప్రత్యర్థులే అయినప్పటికీ ఇప్పుడు ఒక్కటయ్యారు. ఈ ఇద్దరిలో ఎవరు ఏ పార్టీ తరఫున నిల్చున్నా కచ్చితంగా గెలుపు పక్కా అని ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది ఇద్దరూ ఒక్కటైతే పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఉదయగిరిలో వైసీపీ తరఫున ఎవర్ని బరిలోకి దింపాలని అధిష్టానం ఆలోచనలో ఉండగా.. ఈ ఇద్దరూ ఒక్కటి కావడం పార్టీకి బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో వైసీపీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మరి.

Okkatayyaru.jpg

మొత్తానికి చూస్తే.. మేకపాటి చంద్రశేఖర్ పసుపు కండువా కప్పుకోవడం పక్కా అని క్లారిటీ వచ్చేసినట్లే. ఎందుకంటే ఈయన ఇప్పుడు మళ్లీ వైసీపీలో చేరే పరిస్థితులు అయితే లేనేలేవు.. పోనీ టీడీపీ కాకుండా వేరే పార్టీలో అయితే చేరే ఆప్షన్ లేదు. గతంలో ఒకసారి తన దగ్గర డబ్బుల్లేవని ఏ పార్టీ అయినా సరే ఖర్చుపెడితే మాత్రం కచ్చితంగా పోటీచేస్తానని చంద్రశేఖర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు టీడీపీ టికెట్ ఇస్తుందా లేకుంటే వేరొకరికి ఇస్తుందా..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రానున్న రోజుల్లో జిల్లా రాజకీయాల్లో ఎన్నెన్ని మార్పులు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సిందే మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

Telangana Election 2023 : రేవంత్ మాస్టర్ ప్లాన్.. ప్రియాంక పర్యటన ముగిసిన గంటల వ్యవధిలోనే.. ఇదేగానీ జరిగితే..!!

******************************

Revanth Video Viral : బాబోయ్.. రేవంత్ చెప్పిన ఇద్దరు హీరోయిన్ల కథ విన్నారా.. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌.. ఎవరేదో మీరే తేల్చండి..!

******************************

TS New Secretariat : అసలే కొత్త సచివాలయం.. ఆపై కేసీఆర్‌కు నమ్మకాలెక్కువ.. ఈ విషయం బాస్‌ దృష్టికి వెళ్తే..!?

******************************

Balineni Row : మొన్న అలక.. నిన్న కంటతడి.. ఇప్పుడు బాలినేని పరిస్థితి ఎలా ఉందో ఓ లుక్కేయండి..!

******************************

KCR Cabinet Meeting : కొత్త సచివాలయంలో తెలంగాణ కేబినెట్ తొలి భేటీ.. తలనొప్పి తెప్పిస్తున్న లీక్‌లు.. ఈ మంత్రులకు గట్టిగానే కేసీఆర్ తలంటుతారా..!?

*****************************

Updated Date - 2023-05-09T19:16:37+05:30 IST