Share News

US: గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి అదిరిపోయే వార్త.. భారతీయులకు భారీ ప్రయోజనం

ABN , First Publish Date - 2023-10-14T07:53:12+05:30 IST

గ్రీన్‌కార్డుల (Green Card) కోసం ఎదురుచూస్తున్న వారితోపాటు వలసేతర వర్గాలకు ఐదేళ్ల కాలపరిమితితో ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ కార్డులు (Employment authorisation cards) జారీ చేస్తామని జో బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది.

US: గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి అదిరిపోయే వార్త.. భారతీయులకు భారీ ప్రయోజనం

ఎన్నారై డెస్క్: గ్రీన్‌కార్డుల (Green Card) కోసం ఎదురుచూస్తున్న వారితోపాటు వలసేతర వర్గాలకు ఐదేళ్ల కాలపరిమితితో ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ కార్డులు (Employment authorisation cards) జారీ చేస్తామని జో బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. అగ్రరాజ్యం తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ దేశంలో ఏళ్ల తరబడి గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారితో పాటు ఇతర వేలాది మంది భారతీయులకు భారీ ప్రయోజనం చేకూరుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ (US Citizenship and Immigration Services) ఈ మేరకు తాజాగా ప్రకటన చేసింది. ఉపాధి అధారిత కార్డుల చెల్లుబాటును ఐదేళ్లకు పెంచుతున్నట్లు ఏజెన్సీ వెల్లడించింది.

ఇక వీటిలో ఆశ్రయం కోసం దరఖాస్తుదారులను నిలిపివేయడం, ఐఎన్ఏ 245 కింద స్టేటస్‌ను సర్దుబాటు చేయడం, తొలగింపును రద్దు చేయడం వంటివి ఉన్నాయని యూఎస్‌సీఐఎస్ (USCIS) తెలిపింది. కాగా, ఈఏడీల (Employment Authorization Documents) చెల్లుబాటు వ్యవధిని ఐదేళ్లకు పెంచడం అనేది కొత్త ఐ 765 ఫాంల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి ఉద్దేశించబడింది. దీని వల్ల సంబంధిత ప్రాసెసింగ్ సమయాలు, బ్యాక్‌లాగ్‌లను తగ్గించడానికి దోహద పడుతుందని నిపుణులు చెబుతున్నమాట.

ఇదిలాఉంటే అధికారిక గణాంకాల ప్రకారం.. అగ్రరాజ్యం అమెరికాలో (America ) దాదాపు 10.5 లక్షల మంది భారతీయులు (Indians) ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డుల కోసం క్యూలో ఉన్నారు. వీరిలో 4 లక్షల మంది వరకు గ్రీన్‌కార్డు అందుకోకుండానే చనిపోవచ్చని ఇటీవల వెలువడిన గణాంకాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డు బ్యాక్‌లాగ్ ఈ ఏడాది 1.8 మిలియన్ కేసుల కొత్త రికార్డును చేరుకుందని అమెరికన్ లిబర్టేరియన్ థింక్ ట్యాంక్ 'కాటో ఇన్‌స్టిట్యూట్‌'కు చెందిన డేవిడ్ జే బీర్ అధ్యయనంలో తేలింది. బ్యాక్‌లాగ్‌లో ఉన్న 1.8 మిలియన్ల దరఖాస్తులలో 1.1 మిలియన్లు భారతీయులకు (63 శాతం) చెందినవే కావడం గమనార్హం. ఇందులో చైనీయులు 2.50లక్షలు (14 శాతం) ఉన్నారు.

India's Richest 100: భారత సంపన్నుల జాబితాలో ఆరుగురు యూఏఈ నివాసితులు


Updated Date - 2023-10-14T08:00:11+05:30 IST