UK: విజిటర్లు, విద్యార్థులకు బ్రిటన్ బిగ్ షాక్.. భారీగా పెరిగిన వీసా ఫీజులు!

ABN , First Publish Date - 2023-09-17T08:32:00+05:30 IST

స్టూడెంట్స్‌, విజిటర్లకు బ్రిటన్ (Britain) బిగ్ షాక్ ఇచ్చింది. విద్యార్థి, విజిటర్ వీసా ఫీజులను బ్రిటన్ భారీగా పెంచింది. ఆరు నెలలలోపు విజిట్ వీసా ఫీజు (Visit Visa Fee) గతంలో 100 పౌండ్స్ ఉంటే, ఇప్పుడ దాన్ని 115 పౌండ్స్‌కు పెంచింది.

UK: విజిటర్లు, విద్యార్థులకు బ్రిటన్ బిగ్ షాక్.. భారీగా పెరిగిన వీసా ఫీజులు!

లండన్: స్టూడెంట్స్‌, విజిటర్లకు బ్రిటన్ (Britain) బిగ్ షాక్ ఇచ్చింది. విద్యార్థి, విజిటర్ వీసా ఫీజులను బ్రిటన్ భారీగా పెంచింది. ఆరు నెలలలోపు విజిట్ వీసా ఫీజు (Visit Visa Fee) గతంలో 100 పౌండ్స్ ఉంటే, ఇప్పుడ దాన్ని 115 పౌండ్స్‌కు పెంచింది. అలాగే స్టూడెంట్ వీసా రుసుము (Student Visa Fee) ఇంతకుముందు 363 పౌండ్లు ఉండగా తాజాగా 490 పౌండ్లకు పెరిగింది. ఈ కొత్త ఫీజులు అక్టోబర్ 4వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇక తాజా పెంపుతో విజిటర్ వీసా దరఖాస్తు రుసుము రూ.11,835కు చేరితే.. స్టూడెంట్ వీసా అప్లికేషన్ ఫీజు రూ. 50428కి చేరింది.

పార్లమెంటు ఆమోదానికి లోబడి ఇమ్మిగ్రేషన్, జాతీయత రుసుములు అక్టోబర్ 4 నుండి పెరుగుతాయని హోం ఆఫీస్ (Home Office) ప్రకటించింది. "సుస్థిరమైన ఇమ్మిగ్రేషన్, జాతీయత వ్యవస్థను అమలు చేయడానికి వసూలు చేయబడిన వీసా రుసుముల నుండి వచ్చే ఆదాయం కీలక పాత్ర పోషిస్తుంది" అని ఈ సందర్భంగా హోం ఆఫీస్ తెలియజేసింది. ఇక తాజా నిర్ణయంతో వర్క్, సందర్శన వీసాల ధరలో 15శాతం పెరుగుదల ఉంటే.. ప్రాధాన్యత వీసాలు, స్టడీ వీసాలు, స్పాన్సర్‌షిప్ సర్టిఫికేట్‌ల ధరలో కనీసం 20శాతం పెరుగుదల ఉంటుందని హోమ్ ఆఫీస్ పేర్కొంది.

UAE: మీ వద్ద ఈ 3 వీసాలు ఉంటే చాలు.. యూఏఈలో పని చేయకుండా కూడా.. రెసిడెన్సీకి ఇట్టే అనుమతి పొందవచ్చు!

Updated Date - 2023-09-17T08:32:00+05:30 IST