Big Ticket draw: రాత్రికి రాత్రే లక్షాధికారులైన ఇద్దరు భారతీయ ప్రవాసులు..!

ABN , First Publish Date - 2023-05-18T08:47:34+05:30 IST

బిగ్ టికెట్ అబుదాబి వీక్లీ డ్రాలో (Big Ticket Weekly Draw) తాజాగా ఇద్దరు భారతీయ ప్రవాసులకు (Indian Expats) జాక్‌పాట్ తగిలింది.

Big Ticket draw: రాత్రికి రాత్రే లక్షాధికారులైన ఇద్దరు భారతీయ ప్రవాసులు..!

అబుదాబి: బిగ్ టికెట్ అబుదాబి వీక్లీ డ్రాలో (Big Ticket Weekly Draw) తాజాగా ఇద్దరు భారతీయ ప్రవాసులకు (Indian Expats) జాక్‌పాట్ తగిలింది. దాంతో తలో 1లక్ష దిర్హమ్స్ (రూ.22.43లక్షలు) గెలుచుకున్నారు. కువైత్‌లో నివాసం ఉంటున్న నీతు రెగి కురియకోస్, యూఏఈలో ఉంటున్న రాజ్‌కుమార్ చిట్యాలకు ఇలా అదృష్టం వరించడంతో రాత్రికి రాత్రే లక్షాధికారులు అయ్యారు. 33 ఏళ్ల నీతు రెగి గత ఏడేళ్ల నుంచి కువైత్‌లో (Kuwait) పని చేస్తోంది. తన మిత్రులతో కలిసి ఆమె గత కొంతకాలంగా బిగ్ డ్రాలో పాల్గొంటోంది. ఈ క్రమంలో ఈ నెల 11న నిర్వహించిన వీక్లీ డ్రాలో నీతుకు జాక్‌పాట్ తగిలింది. బిగ్ టికెట్ నిర్వాహకుల నుంచి తాను విజేతనని ఫోన్‌కాల్ రావడంతో సర్‌ప్రైజ్ అయ్యానని ఆమె తెలిపింది.

ఇక తాను గెలుచుకున్న భారీ మొత్తాన్ని తన స్నేహితులతో పంచుకుంటానని చెప్పిన ఆమె.. తన వాటాలో కొంత మొత్తాన్ని చారిటీకి వినియోగిస్తానని చెప్పింది. రెండో విజేత రాజ్‌కుమార్ చిట్యాల.. యూఏఈలోని (UAE) ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. గత ఏడాది కాలంగా క్రమం తప్పకుండా అబుదాబి బిగ్ టికెట్ డ్రాలో (Abu Dhabi Big Ticket Draw) పాల్గొంటున్నాడు. ఏదో ఒకరోజు తనకు అదృష్టం కలిసొస్తుందనుకున్నానని.. ఇప్పుడు అదే జరిగిందని రాజ్‌కుమార్ ఆనందం వ్యక్తం చేశాడు. ఇకపై కూడా బిగ్ టికెట్‌లో లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తానని తెలిపాడు. ఇంత భారీ మొత్తం గెలుచుకున్నందుకు ఆనందంగా ఉందన్నాడు.

Nomad Passport Index: వరల్డ్‌లోనే బెస్ట్ పాస్‌పోర్ట్ యూఏఈదే.. మన ర్యాంక్ ఎంతో తెలిస్తే షాకవుతారు..!

Updated Date - 2023-05-18T08:48:06+05:30 IST