TPAD: డాలస్‌లో ఘనంగా 'టీ-పాడ్' నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

ABN , First Publish Date - 2023-03-10T09:37:29+05:30 IST

డాలస్ తెలంగాణ ప్రజాసమితి 'టీ-పాడ్' (Telangana Peoples Association of Dallas- TPAD) నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది.

TPAD: డాలస్‌లో ఘనంగా 'టీ-పాడ్' నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం

ఎన్నారై డెస్క్: డాలస్ తెలంగాణ ప్రజాసమితి 'టీ-పాడ్' (Telangana Peoples Association of Dallas- TPAD) నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం డాలస్‌లోని శుభం బాన్క్వెట్ హాల్, ఫ్రిస్కో నగరములో నిర్వహించారు. డాలస్‌ ప్రాంతీయులు, అన్ని స్థానిక, తెలుగు జాతీయ సంస్థల నాయకులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజల్వన, గణపతి ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఇక నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ముందు స్థానిక సంగీత ఉపాధ్యాయురాలు, గాయని సమీర శ్రీపాద ఓ ప్రత్యేక ఆవాహన గీతాన్ని పాడారు. అనంతరం టీ-పాడ్ (TPAD) బృందం.. అమెరికా, భారత దేశం జాతీయ గీతాలను ఆలపించారు. అనంతరం కొత్తగా ఎన్నికైన 10వ కార్యవర్గ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. లక్ష్మీ పోరెడ్డి కార్యక్రమాన్ని ఒక ప్రణాళిక ప్రకారం చక్కగా నిర్వహించారు. టీ-పాడ్ ఏర్పాటు చరిత్ర, అనేక సంవత్సరాలుగా నిర్వహించిన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల గురించి ఆమె సభికులకు వివరించారు. అలాగే ఎఫ్‌సీ చైర్మన్ రఘువీర్ బండారు, బీఓటీ చైర్మన్ సుధాకర్ కలసాని, ప్రెసిడెంట్ లింగారెడ్డి అల్వా, బీఓటీ వైస్ చైర్ గోలి బుచ్చిరెడ్డి, కోఆర్డినేటర్ రోజా ఆడెపుతో సహా కొత్తగా ఎన్నికైన టీమ్ సభ్యులందరితో లక్ష్మీ పోరెడ్డి ప్రమాణం చేయించారు.

ఎఫ్‌సీ చైర్మన్ రఘువీర్ బండారు, బీఓటీ చైర్మన్ సుధాకర్ కలసాని, ప్రెసిడెంట్ లింగారెడ్డి అల్వా, బీఓటీ వైస్ చైర్ గోలి బుచ్చిరెడ్డి, కోఆర్డినేటర్ రోజా ఆడెపు, కార్యదర్శి రత్న ఉప్పల, ఉపాధ్యక్షురాలు అనురాధ మేకల మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన బృందం బ్లడ్ డ్రైవ్‌లు, ఫుడ్ డ్రైవ్‌లు, తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలను జరుపుకోవడం, బతుకమ్మ మరియు దసరా సంబరాలను వాటి సిగ్నేచర్ స్టైల్‌లో నిర్వహించడం వంటి కార్యక్రమాలలో పాల్గొనాలని కోరారు. ఫౌండేషన్ కమిటీ మాజీ చైర్ అజయ్ రెడ్డి మాట్లాడుతూ టీపీఏడీ తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించడమే కాకుండా జట్టు సభ్యులకు నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడానికి వేదిక అయిందని అన్నారు. చివరగా ఈ ఏడాది టీపాడ్ చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు ప్రాంతీయ, జాతీయ సంస్థల నాయకులు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను అభినందించారు.

నూతనంగా ఎన్నికైన టీ-పాడ్ కార్యవర్గ కమిటీ-2023 ఇదే..

ఎగ్జిక్యూటివ్ కమిటీ: లింగారెడ్డి ఆళ్వా(అధ్యక్షుడు), అనురాధ మేకల(వైస్ ప్రెసిడెంట్), రమణ లష్కర్(పాస్ట్ ప్రెసిడెంట్), రత్న ఉప్పల, శ్రీనివాస్ అన్నమనేని, రూప కన్నయ్యగారి, మాధవి లోకిరెడ్డి, లక్ష్మీ పోరెడ్డి, మధుమతి వైశ్యరాజు, శ్రీధర్ వేముల, బాల గణపవరపు, స్వప్న తుమ్మపాల, స్వప్న, రేణుకా చనమోలు, గాయత్రి బుషిగంపాల, శంకర్ పరిమళ్.

ధర్మకర్తల మండలి: సుధాకర్ కలసాని, గోలి బుచ్చి రెడ్డి, రోజా ఆడెపు, ఇంద్రాణి పంచేరుపుల, పాండు రంగారెడ్డి పాల్వాయి, మాధవి సుంకిరెడ్డి, పవన్ గంగాధర, అశోక్ కొండల, రామ్ అన్నాడి, రాజ్ గోంధి, రవికాంత్ మామిడి, రాంపాల్ గడ్డం, సత్య పెరికరి.

ఫౌండేషన్ కమిటీ: రఘువీర్ బండారు, మహేందర్ కామిరెడ్డి, రావు కల్వల, అజయ్ రెడ్డి, జానకిరామ్ మందడి, ఉపేందర్ తెలుగు, రాజ్ గోంధీ.

Updated Date - 2023-03-10T09:58:17+05:30 IST