TPAD ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం విజయవంతం

ABN , First Publish Date - 2022-11-09T15:10:05+05:30 IST

తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్(టీపాడ్) ఆధ్వర్యంలో తాజాగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం విజయవంతం అయింది. టీపాడ్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో బ్లడ్ డొనేషన్ చేయడానికి పలువురు ఆసక్తి చూపారు. రోజు మొత్తం

TPAD ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం విజయవంతం

ఎన్నారై డెస్క్: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్(టీపాడ్) ఆధ్వర్యంలో తాజాగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం విజయవంతం అయింది. టీపాడ్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో బ్లడ్ డొనేషన్ చేయడానికి పలువురు ఆసక్తి చూపారు. రోజు మొత్తం సాగిన ఈ కార్యక్రమంలో దాదాపు 69 మంది దాతలు రక్తాన్ని దానం చేశారు. 69 మంది నుంచి సుమారు 52 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్టు టీపాడ్ ఓ ప్రకటనలో తెలిపింది. 52 యూనిట్ల రక్తాన్ని Carter blood care‌కు అందించినట్టు వెల్లడించింది. రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన ఈ రక్తంతో సుమారు156 మంది ప్రాణాలు రక్షించొచ్చని తెలిపింది.

అంతేకాకుండా.. దాదాపు 10 మందికి హార్ట్ సర్జరీలు చేయడానికి లేదా 17 మందికి రక్త మార్పిడి చేయడానికి ఈ 52 యూనిట్ల రక్తం సరిపోతుందని చెప్పింది. దాతల కోసం లంచ్, బ్రేక్‌ఫాస్ట్‌ను ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. అంతేకాకుండా దాతలు చేసిన గొప్ప పనికి అభినందిస్తూ బ్లాంకెట్లను బహుమతిగా అందించినట్టు వెల్లడించింది. రక్తదాన శిభిరం విజయవంతం కావడానికి సహకరించిన రఘువీర బండారు, ఉమా బండారు‌తోపాటు వలంటీర్లకు Carter blood care‌ టెక్నీషియన్లకు ఈ సందర్భంగా టీపాడ్ ధన్యవాదాలు తెలిపింది. గాయత్రి గిరి, చక్రీ నారా, అజయ్ రెడ్డి(ఎఫ్‌సీ చైర్), రమణ లష్కర్(ప్రెసిడెంట్), ఇంద్రాని పంచెరుపుల(బీఓటీ), పాండు పాల్వే(కోఆర్డినేటర్) తదితర సభ్యులు అందరూ కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు వెల్లడించింది.

Untitled-6.jpg

కాగా.. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్(TPAD) గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి ఏటా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తున్న నేపథ్యంలో రక్త నిలువలు తగ్గిపోయిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి టీపాడ్ ఏటా రెండు సార్లు బ్లడ్ డొనేషన్ క్యాంపును ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా 10వ బ్లడ్ డొనేషన్ క్యాంపును విజయవంతంగా నిర్వహించింది. గత ఏప్రిల్‌లో 53 మంది దాతలు బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొనగా.. ఇప్పుడు ఆ సంఖ్య 69కు చేరింది.

Updated Date - 2022-11-09T15:10:07+05:30 IST