Share News

NRI: తామా-తానా ఆధ్వర్యంలో ఉచిత ఫ్లూ టీకాల కార్యక్రమం

ABN , First Publish Date - 2023-10-15T09:25:13+05:30 IST

తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA), తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA), వాల్‌గ్రీన్స్‌ (Walgreens) వారు అక్టోబర్ 7న (శనివారం) అట్లాంటాలోని తామా కార్యాలయంలో ‘ఉచిత టీకాల డ్రైవ్’ నిర్వహించారు.

NRI: తామా-తానా ఆధ్వర్యంలో ఉచిత ఫ్లూ టీకాల కార్యక్రమం

NRI: తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA), తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA), వాల్‌గ్రీన్స్‌ (Walgreens) వారు అక్టోబర్ 7న (శనివారం) అట్లాంటాలోని తామా కార్యాలయంలో ‘ఉచిత టీకాల డ్రైవ్’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. దాదాపు 100 మంది అన్ని వయసుల వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ప్రముఖ ఫార్మసిస్టులు మితేష్ పటేల్, సూర్య వంగపండు, స్మృతి ఘాగ్ ఎంతో ఓపికగా ప్రతి ఒక్కరికీ టీకాలు అందేలా చూశారు. ఇక ఈ కార్య్రమానికి హాజరైన వారు తామా చేస్తున్న కృషిని మెచ్చుకున్నారు. ఇటువంటి విశిష్ట కార్యక్రమాలు చేపట్టే సంస్థ మరొకటి లేదని ప్రశంసించారు. 10,000 మందికి పైగా సేవలందించి, అప్రతిహతంగా సాగుతున్న తామా వీక్లీ ఫ్రీ క్లినిక్‌ను ఈ సందర్భంగా వారు గుర్తు చేయడం జరిగింది.

TT.jpg

ఇతర విషయాలతో పాటు ఆరోగ్యం, సామాజిక బాధ్యత, యువతకు ప్రాధాన్యతతో సాగుతున్న తామా, చాలా మందికి సహాయపడే అనేక ప్రత్యేక కార్యక్రమాలను చేస్తుంది. 2023లో ఇది వారి 21వ కార్యక్రమం. రాబోయే రోజులలో దసరా బతుకమ్మ వేడుకలు, విల్ & ట్రస్ట్ గ్రాండ్ మేళా, డిస్కవరీ ఫ్లైట్ (ఫస్ట్ ఫ్లైట్ ఫ్లయింగ్), చెస్, దీపావళి ఇలా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించనుంది. ఈ కార్యక్రమాల వివరాల కోసం తామా అధికారిక వెబ్‌సైట్ www.tama.org ని సందర్శించడం లేదా info@tama.org కి ఇమెయిల్ చేయవచ్చు.

TTT.jpg

తామా బృందం ముందస్తుగా రిజిస్ట్రేషన్‌లను తీసుకోవడమే కాకుండా, డ్రైవ్‌ను అమలు చేయడంలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించింది. స్నాక్స్ మరియు పానీయాలు అందించడం జరిగింది. తామా అధ్యక్షుడు సాయిరామ్ కారుమంచి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ సురేష్ బండారు, ఛైర్మన్ సుబ్బారావు మద్దాళి, సునీత పొట్నూరు, శ్రీనివాస్ రామిశెట్టి, సునీల్ దేవరపల్లి, శ్రీనివాస్ ఉప్పు, తానా ఆర్‌విపి మధు యార్లగడ్డ, శ్రీనివాస్ లావు, వినయ్ మద్దినేని, కిరణ్ గోగినేని, భరత్ మద్దినేని, యువ వాలంటీర్లు ఈ కార్యక్రమం సజావుగా జరగడానికి ఎంతో కృషి చేశారు.

TTTT.jpg

ఇక తామా చాలా సంవత్సరాలుగా ఇలాంటి డ్రైవ్‌లను క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది. అలాగే మహమ్మారి సమయంలో కూడా అనేక కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లు నిర్వహించింది. రాబోయే సంవత్సరాలలో కూడా తామా ఈ డ్రైవ్‌లను కొనసాగిస్తుందని సురేష్ చెప్పారు. మితేష్, సూర్య, స్మృతి, వాలంటీర్లు, తామా & తానా టీమ్‌లకు ఇటువంటి గొప్ప కార్యక్రమంలో భాగమైనందుకు ధన్యవాదాలు తెలియజేశారు. చివరగా ఈ కార్యక్రమాన్ని శుభప్రదంగా ముగించారు.

TTTTTT.jpg

Updated Date - 2023-10-15T09:25:13+05:30 IST