Share News

TAGKC: కాన్సాస్ నగరంలో కన్నుల పండువగా బతుకమ్మ సంబరాలు

ABN , First Publish Date - 2023-10-25T11:16:21+05:30 IST

అమెరికాలోని కాన్సాస్ నగరంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (Telugu Association of Greater Kansas City-TAGKC) ఆధ్వర్యంలో స్థానిక హిందు దేవాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.

TAGKC: కాన్సాస్ నగరంలో కన్నుల పండువగా బతుకమ్మ సంబరాలు

TAGKC: అమెరికాలోని కాన్సాస్ నగరంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (Telugu Association of Greater Kansas City-TAGKC) ఆధ్వర్యంలో స్థానిక హిందు దేవాలయంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో దాదాపు 3000 మంది తెలుగు వారు పాల్గొన్నారు. మొదట అమ్మ వారి పూజా కార్యక్రమాన్ని దేవాలయ పూజారి శ్రీనివాసాచారి, టీఏజీకేసీ (TAGKC) అధ్యక్షులు నరేంద్ర దూదేళ్ళ దంపతులతో నిర్వహించారు.

BB.jpg

ఈ సంబరాలను మొదటి నుండి చివరి వరకు వ్యాఖ్యాత రేణు శ్రీ ఎంతో ఉత్సాహంగా నడిపించారు. మహిళలు అంతా ఎంతో చక్కగా సంప్రదాయ దుస్తులను ధరించి వచ్చారు. అలాగే రంగు రంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఈ సంబరాలలో పాల్గొన్నారు. ఆద్యంతం ఎన్నో ఉత్సాహభరితమైన తెలంగాణ జానపద బతుకమ్మ పాటలకు అందరూ అంతే ఉత్సాహంగా నృత్యాలు చేశారు.

BBBB.jpg

బతుకమ్మలు తెచ్చిన వారికి లాటరీ టికెట్ (Raffle Tickets) ఇచ్చి మధ్య మధ్యలో రాఫెల్‌లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. అంతే కాకుండా అందంగా పేర్చిన ఎనిమిది బతుకమ్మలకు చీరెలను బహుమతులుగా అందజేయడం జరిగింది. బతుకమ్మలను నిమజ్జనం చేశాక చివరగా అందరూ కలిసి చక్కని భోజనం చేసి పండుగని ఆనందంగా జరుపుకున్నారు.

BBBBBB.jpg

ఈ కార్యక్రమానికి సహాయపడ్డ కార్యకర్తలందరికీ, స్పాన్సర్స్‌కి, టీఏజీకేసీ అధ్యక్షులు నరేంద్ర దూదేళ్ళ, ఉప అధ్యక్షులు చంద్ర యక్కలి, ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీధర్ అమిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ అండ్ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

BBBBB.jpgBBBBBBB.jpgBBBBBBBB.jpg

Updated Date - 2023-10-25T11:16:21+05:30 IST