Nashville School Shooting: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ పేలిన తూటా.. ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు మృతి!

ABN , First Publish Date - 2023-03-28T08:39:45+05:30 IST

నాష్‌విల్లేలోని (Nashville) ఓ పాఠశాలలో ఓ మహిళ నరమేధానికి పాల్పడింది. Six Killed in Nashville School Shooting Including Three Children rams spl

Nashville School Shooting: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ పేలిన తూటా.. ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు మృతి!

నాష్‌విల్లే: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ తూటా పేలింది. నాష్‌విల్లేలోని (Nashville) ఓ పాఠశాలలో ఓ మహిళ నరమేధానికి పాల్పడింది. ఆమె విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఆరుగురు చనిపోయారు. మృతిచెందిన వారిలో ముగ్గురు విద్యార్థులు, ముగ్గురు స్కూల్ సిబ్బంది ఉన్నారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు (తొమ్మిదేళ్లలోపు వారు) ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. టేనస్సీ రాష్ట్ర రాజధాని అయిన నాష్‌విల్లేలోని ఓ ప్రైవేట్ ఎలిమెంటరీ పాఠశాలలో సోమవారం ఈ ఘోరం జరిగింది. కాగా, ఈ కాల్పులకు పాల్పడిన సదరు మహిళను అదే పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థినిగా గుర్తించారు. ఆమెను పోలీసులు అక్కడికక్కడే కాల్చి చంపారు.

నాష్‌విల్లేకు చెందిన ఆడ్రీ హేల్ (28) అనే మహిళనే ఈ కాల్పులకు తెగబడినట్లు పోలీసులు వెల్లడించారు. రెండు రైఫిల్స్, ఓ హ్యాండ్ గన్‌తో పాఠశాల సైడ్ డోర్ నుంచి ప్రవేశించిన ఆడ్రీ.. విచక్షణారహితంగా కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ముగ్గురు చిన్నారులు, ముగ్గురు సిబ్బంది అక్కడికక్కడే మృతిచెందారు. 911 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు 15నిమిషాల వ్యవధిలోనే ఘటనాస్థలికి చేరుకుని దుండగురాలిని కాల్చి చంపారు. ఈ ఘటనపై అధికార భవనం వైట్‌హౌజ్ (White House) విచారం వ్యక్తం చేసింది. ఇది హృదయవిదారకరమైన ఘటన అని ప్రకటించింది. జో బైడెన్ (Joe Biden) చేస్తున్న ఆయుధ నిషేధ చట్టానికి (Assult Weapons Ban) మద్దతు ఇవ్వాలంటూ ఈ సందర్భంగా రిపబ్లికన్లను (Republicans) శ్వేతసౌధం కోరింది.

ఇది కూడా చదవండి: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది స్పాట్ డెడ్!

Updated Date - 2023-03-28T08:39:45+05:30 IST