Road Accident: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది స్పాట్ డెడ్!

ABN , First Publish Date - 2023-03-28T08:06:47+05:30 IST

సౌదీ అరేబియాలో (Saudi Arabia) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Road Accident: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది స్పాట్ డెడ్!

రియాద్: సౌదీ అరేబియాలో (Saudi Arabia) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్కా (Makkah) వెళ్తున్న ఉమ్రా యాత్రికుల (Umrah Pilgrims) బస్సు యాసిర్ గవర్నరేట్ (Asir governorate) పరిధిలోని అకబా షార్ ప్రాంతంలో ఓ వంతెనను ఢీకొట్టి బోల్తా పడింది. దాంతో బస్సులో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది యాత్రికులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 29 మంది గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ సహాయక బృందాలు వెంటనే ప్రమాదాస్థలికి చేరుకుని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు ( Hospitals) తరలించాయి. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు స్థానిక అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2023-03-28T08:08:52+05:30 IST