Share News

TANA: సిరివెన్నెల సాహిత్య రచనలకు పుస్తక రూపం

ABN , First Publish Date - 2023-10-20T08:20:32+05:30 IST

ప్రముఖ సినీగీత రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుండి జాలువారిన సినీ, సినీయేతర సాహిత్యాలను ఆరు సంపుటాలను ప్రచురించినట్లు తానా సాహిత్య విభాగం- తానా ప్రపంచ సాహిత్య వేదిక వెల్లడించింది.

TANA: సిరివెన్నెల సాహిత్య రచనలకు పుస్తక రూపం

TANA: ప్రముఖ సినీగీత రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి కలం నుండి జాలువారిన సినీ, సినీయేతర సాహిత్యాలను ఆరు సంపుటాలను ప్రచురించినట్లు తానా సాహిత్య విభాగం- తానా ప్రపంచ సాహిత్య వేదిక వెల్లడించింది. ఇందులో సినీ సాహిత్యం (నాల్గు సంపుటాలు), సినీయేతర సాహిత్యం (రెండు సంపుటాలు) మొత్తం ఆరు సంపుటాలను ప్రచురించడం జరిగింది. సిరివెన్నెల కుటుంబ సభ్యుల సహకారంతోనే ఇది సాధ్యమైందని ఓ ప్రకటనలో పేర్కొంది. తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి నిర్వహణలో తానా సాహిత్య విభాగం-తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు ప్రసాద్ తోటకూర సంపాదకులుగా, ప్రముఖ సాహిత్యవేత్త కిరణ్ ప్రభ ప్రధాన సంపాదకుడిగా అత్యున్నత ప్రమాణాలతో ఈ గ్రంథాలను రూపొందించారు. ఈ గ్రంథాలు విశ్వవ్యాప్తంగా ఉన్న సిరివెన్నెల అభిమానులకు తరగని సిరిగా నిలుస్తాయనడంలో అతిశయోక్తి లేదు.

SSS.jpg

సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యం- సినిమా పాటలు మొదటి సంపుటి (1986 నుండి 1992 వరకు-513 పాటలు), రెండవ సంపుటి (1993 నుండి 1995 వరకు-509 పాటలు), మూడవ సంపుటి (1996 నుండి 2002 వరకు - 549 పాటలు), నాల్గవ సంపుటి (2003 నుండి 2022; 470 పాటలు) మొత్తం 2, 041 పాటలను అక్షరబద్ధం చేశామని తానా సాహిత్య వేదిక వెల్లడించింది. సినీయేతర సాహిత్యం ఐదవ సంపుటి (417 పేజీలు), ఆరవ సంపుటిగా (464 పీజీలు) ముద్రించినట్లు తెలిపింది. ప్రస్తుతం సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యం ఆరు సంపుటాలు ఇటు అమెరికా సహా భారత్‌లోనూ అందుబాటులో ఉన్నాయని తానా సాహిత్య విభాగం వెల్లడించింది. అమెరికాలో కొనుగోలు చేసే ఆసక్తి ఉన్నవారు తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మొబైల్ నంబర్ 817 300 4747లో గానీ, ఈమెయిల్: prasadthotakura@gmail.com ద్వారా గానీ సంప్రదించవచ్చు. ఇండియాలో కొనుగోలు చేయదలచిన వారు శ్రీరామశర్మ, మొబైల్ నంబర్ +91-94400-66633లో గానీ లేదా sriramasastry@gmail.com ద్వారా గానీ సంప్రదించవచ్చని తానా సాహిత్య వేదిక తెలిపింది.

TANA.jpg

Updated Date - 2023-10-20T08:20:32+05:30 IST