TANA: తానా ఆధ్వర్యంలో “తెలుగు నాటక సాహిత్యం” పై జరిపిన చర్చావేదిక విజయవంతం

ABN , First Publish Date - 2023-05-03T10:33:50+05:30 IST

ఉత్తరఅమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్యవేదిక (TANA Prapacha sahitya vedika) ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” (ప్రతినెలా ఆఖరిఆదివారం) 47వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం (ఏప్రిల్16, కందుకూరి వీరేశలింగం జయంతి) తెలుగు నాటకరంగ దినోత్సవం సందర్భంగా “తెలుగు నాటకసాహిత్యం” అనే అంశంపై విస్తృత సమావేశం విజయవంతమయింది.

TANA: తానా ఆధ్వర్యంలో “తెలుగు నాటక సాహిత్యం” పై జరిపిన చర్చావేదిక విజయవంతం

డాలస్, టెక్సాస్: ఉత్తరఅమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్యవేదిక (TANA Prapacha sahitya vedika) ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” (ప్రతినెలా ఆఖరిఆదివారం) 47వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం (ఏప్రిల్16, కందుకూరి వీరేశలింగం జయంతి) తెలుగు నాటకరంగ దినోత్సవం సందర్భంగా “తెలుగు నాటకసాహిత్యం” అనే అంశంపై విస్తృత సమావేశం విజయవంతమయింది. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర శతాబ్దాల చరిత్ర కల్గిన నాటకరంగంలో పద్య నాటకాలు, పౌరాణిక, సాంఘిక నాటకాలు, రంగస్థల నాటకాలు, రేడియో నాటకాలు సమాజంపై ఒకప్పుడు చూపిన ప్రభావం, ప్రస్తుత దుస్థితి, దాన్ని మెరుగుపరచడానికి వ్యక్తుల, సంస్థల, ప్రభుత్వాలు పోషించవలసిన పాత్రను విశదీకరించి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథులందరికీ ఆహ్వానం పలికారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు, ప్రముఖ నాటకరచయిత, దర్శకులు ఆచార్య డా. డి.ఎస్.ఎన్ మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని నాటకరంగ పూర్వవైభవం, పునరిద్దరించడానికి తీసుకోవలసిన చర్యలను సోదాహరణంగా వివరించారు.

KK.jpg

ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా శారదా శ్రీనివాసన్, సుప్రసిద్ధ రేడియోకళాకారిణి – “రేడియో నాటకాల స్వర్ణయుగం” అనే అంశంపై, డా. మామిడి హరికృష్ణ, తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతికశాఖ సంచాలకులు – “తెలంగాణలో నాటకరంగం నేడు-రేపు” అనే అంశంపై, డా. దీర్ఘాసి విజయభాస్కర్, ప్రముఖ నాటకరచయిత – “దళిత, గిరిజననేపథ్య నాటకాలు” అనే అంశంపై, డా. బులుసు అపర్ణ, ప్రముఖ శతావధాని – “స్త్రీల సమస్యలపై వెలువడిన నాటకాలు” అనే అంశంపై, వాడ్రేవు సుందర్రావు, ప్రముఖ రచయిత, వ్యాఖ్యత, నటులు, విశ్రాంత అధ్యాపకులు – “దేశభక్తి, జాతీయోద్యమ స్పూర్తిదాయక నాటకాలు” అనే అంశంపై, గుమ్మడి గోపాలకృష్ణ, సుప్రసిద్ధ రంగస్థల నటులు – “పౌరాణిక, చారిత్రాత్మికనాటకాలు” అనే అంశంపై, డా. కందిమళ్ళ సాంబశివరావు, ప్రముఖ నాటకరచయిత, విశ్రాంతఅధ్యాపకులు – “తెలుగు నాటకకళాపరిషత్తులు” అనే అంశంపై తమ విలువైన అభిప్రాయాలను వెలిబుచ్చి దివంగత నాటక రచయితలకు, కళాకారులకు నివాళులర్పించారు.

Updated Date - 2023-05-03T10:33:50+05:30 IST