Saudi Arabia: విదేశీ విజిటర్లకు సౌదీ అదిరిపోయే ఆఫర్.. ఏకంగా ఏడాది పాటు..

ABN , First Publish Date - 2023-09-27T09:37:27+05:30 IST

విదేశీ సందర్శకులను ఆకర్షించేందుకు అరబ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) సరికొత్త ప్రణాళికతో ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు వీసా వెసులుబాటులు కల్పిస్తున్న సౌదీ.. తాజాగా మరో అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది.

Saudi Arabia: విదేశీ విజిటర్లకు సౌదీ అదిరిపోయే ఆఫర్.. ఏకంగా ఏడాది పాటు..

జెడ్డా: విదేశీ సందర్శకులను ఆకర్షించేందుకు అరబ్ దేశం సౌదీ అరేబియా (Saudi Arabia) సరికొత్త ప్రణాళికతో ముందుకు వచ్చింది. ఇప్పటికే పలు వీసా వెసులుబాటులు కల్పిస్తున్న సౌదీ.. తాజాగా మరో అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. తమ దేశానికి వచ్చే అంతర్జాతీయ విజిటర్లు ఏకంగా ఏడాది పాటు విదేశీ డ్రైవింగ్ లైసెన్స్‌ (Foreign driving license) ను ఉపయోగించుకునే వీలు కల్పించింది. ఈ మేరకు సౌదీ ట్రాఫిక్ విభాగం (Saudi Arabia Traffic Department) తాజాగా కీలక ప్రకటన చేసింది. విదేశీ సందర్శకులు అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ (International driving license) లేదా చెల్లుబాటు అయ్యే విదేశీ లైసెన్స్ కలిగి ఉంటే, దేశంలోకి ప్రవేశించిన తేదీ నుండి ఒక ఏడాది పాటు వారి డ్రైవింగ్ లైసెన్స్‌లను ఉపయోగించుకోవచ్చని సౌదీ జనరల్ ట్రాఫిక్ విభాగం తన ప్రకటనలో పేర్కొంది.

ఈ సందర్భంగా 'మల్టిపుల్ ఎంట్రీ బిజినెస్ విజిటర్ వీసా'పై సౌదీ అరేబియాకు వచ్చిన వ్యక్తి చెల్లుబాటయ్యే విదేశీ డ్రైవింగ్ లైసెన్స్‌ను ఉపయోగించవచ్చా? అనే ఓ విదేశీయుడి ప్రశ్నకు సైతం ట్రాఫిక్ విభాగం బదులిచ్చింది. ఇక ఇటీవలి కాలంలో సౌదీ ఎక్కువ మంది విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి అనేక సౌకర్యాలను తీసుకొచ్చింది. దీనిలో భాగంగా పలు దేశాల పౌరులకు టూరిస్ట్ వీసా ఆన్ అరైవల్ కూడా ఆన్‌లైన్‌లోనే జారీ చేస్తోంది. అలాగే గత జూలైలో సౌదీ అరేబియా 'బిజినెస్ విజిట్ ఎలక్ట్రానిక్ వీసా'ను ప్రారంభించింది. దీనిని 'విజిటింగ్ ఇన్వెస్టర్ వీసా' (Visiting Investor Visa) అంటారు. సౌదీ అరేబియాలోని పెట్టుబడి అవకాశాలను అర్థం చేసుకునేందుకు విదేశీయులు ఆ దేశానికి వెళ్లేందుకు వీలు కల్పించే లక్ష్యంతో 'విజిటింగ్ ఇన్వెస్టర్ వీసా'ను తీసుకురావడం జరిగింది. ఇక సౌదీ సర్కార్ ఈ ఏడాది మొత్తంగా 25 మిలియన్ల విదేశీ పర్యాటకులను (Foreign Tourists) ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Saudi Arabia: ఉల్లంఘనదారులపై ఉక్కుపాదం.. 7 రోజుల్లోనే 15వేల మంది అరెస్ట్.. 10వేల మందికిపైగా దేశ బహిష్కరణ!

Updated Date - 2023-09-27T09:37:27+05:30 IST