UAE Visa Issues: గోల్డెన్ ఛాన్స్.. ఓవర్‌స్టే, వీసా సంబంధిత సమస్యల పరిష్కారానికి చక్కటి అవకాశం!

ABN , First Publish Date - 2023-02-26T09:21:33+05:30 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (UAE) వీసా సంబంధిత సమస్యలను (visa-related issues) ఎదుర్కొంటున్న వ్యక్తులకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ అఫైర్స్ (General Directorate of Residency and Foreign Affairs) శుభవార్త చెప్పింది.

UAE Visa Issues: గోల్డెన్ ఛాన్స్.. ఓవర్‌స్టే, వీసా సంబంధిత సమస్యల పరిష్కారానికి చక్కటి అవకాశం!

అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (UAE) వీసా సంబంధిత సమస్యలను (visa-related issues) ఎదుర్కొంటున్న వ్యక్తులకు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ అఫైర్స్ (General Directorate of Residency and Foreign Affairs) శుభవార్త చెప్పింది. వీసా సమస్యలు ఉన్న నివాసితులు, సందర్శకులు, పర్యాటకుల కోసం దీరా సిటీ సెంటరల్‌లో (Deira City Center) 'అందరికీ హోంల్యాండ్' (A Homeland for All) పేరిట మూడు రోజుల క్యాంపెయిన్‌ను (Campaign) నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 25 నుంచి 27వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ప్రచార కార్యక్రమంలో పలు వీసా సమస్యలను పరిష్కరించనున్నారు.

వీసా గడువు ముగిసిన వారు, వీసా అనుమతి కంటే ఎక్కువ కాలం బస చేసిన వారితో సహా వీసాలో ఏవైనా సమస్యలు ఉన్నవారికి సహాయం చేయడానికి సెంటర్‌పాయింట్‌కు సమీపంలోని దీరా సిటీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన స్టాల్‌లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జీడీఆర్ఎఫ్ఏ (GDRFA) అధికారులు అందుబాటులో ఉంటారు. వీసా సమస్యలున్న వారు స్టాల్ వద్దకు రావాలని జీడీఆర్ఎఫ్ఏ‌లోని క్లయింట్ హ్యాపీనెస్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ సలేం బిన్ అలీ (Lt-Col Salem bin Ali) సూచించారు. యూఏఈలో అనుమతించబడిన వీసా వ్యవధి కంటే ఎక్కువ కాలం స్టే చేసినందుకు రోజుకు 50 దిర్హమ్స్ (రూ. 1,128) జరిమానా ఉంటుంది. దీంతో పాటు వీసా (Visa) కూడా రద్దు అయ్యే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి: 70 దేశాల వారికి 'వీసా ఆన్ అరైవల్' సౌకర్యం.. 6నెలల వరకు స్టే చేసే ఫేసిలిటీ.. కానీ, మనోళ్లకు మాత్రం..

Updated Date - 2023-02-26T10:19:36+05:30 IST