Share News

UAE Visas: రెసిడెన్సీ నుంచి గోల్డెన్ వీసా వరకు.. ఇంట్లో నుంచే రెన్యువల్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..

ABN , First Publish Date - 2023-10-21T08:53:37+05:30 IST

రెసిడెన్సీ నుంచి గోల్డెన్ వీసా వరకు ఇలా ఏ వీసా అయినా సరే.. ఇంట్లో నుంచి కదలకుండా దరఖాస్తు, రెన్యువల్ చేసుకోవచ్చు. అలాగే ఎమిరేట్స్ ఐడీ అప్‌డేట్ లేదా ఇతర ఏదైనా మార్పులు చేయాలన్న ఇప్పుడు చాలా ఈజీ. దీనికోసం ప్రత్యేకంగా అమెర్ కేంద్రాలకు (Amer centres) వెళ్లాల్సిన అవసరం లేదు.

UAE Visas: రెసిడెన్సీ నుంచి గోల్డెన్ వీసా వరకు.. ఇంట్లో నుంచే రెన్యువల్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..

దుబాయ్: రెసిడెన్సీ నుంచి గోల్డెన్ వీసా వరకు ఇలా ఏ వీసా అయినా సరే.. ఇంట్లో నుంచి కదలకుండా దరఖాస్తు, రెన్యువల్ చేసుకోవచ్చు. అలాగే ఎమిరేట్స్ ఐడీ అప్‌డేట్ లేదా ఇతర ఏదైనా మార్పులు చేయాలన్న ఇప్పుడు చాలా ఈజీ. దీనికోసం ప్రత్యేకంగా అమెర్ కేంద్రాలకు (Amer centres) వెళ్లాల్సిన అవసరం లేదు. యూఏఈ సర్కార్ ఈ ప్రాసెస్ కోసం వర్చువల్ సర్వీస్‌ను (Virtual Service) అందుబాటులోకి తెచ్చింది. దాంతో వినియోగదారులు ఎంచక్కా ఇంట్లో కూర్చొనే వీసా రెన్యువల్, ఐడీ మార్పులు చేసుకునే వెసులుబాటు ఏర్పడింది. అమెర్ కేంద్రం అధికారులు వీసా సంబంధిత సేవలను వీడియో కాన్ఫరెన్స్ (Video Conference) ద్వారా అందించడం జరుగుతుంది. దీనికోసం జిటెక్స్ గ్లోబల్ 2023 (Gitex Global 2023) టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) - దుబాయ్ వెల్లడించింది. "వీసాలకు సంబంధించిన ఏదైనా సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తుదారు భౌతికంగా అమెర్ కేంద్రానికి రావాల్సిన అవసరం లేదు. కస్టమర్ ఇప్పుడు వర్చువల్ అమేర్ సర్వీస్‌ని వినియోగించుకోవచ్చు. మీ సమస్యను పరిష్కరించుకోవడానికి జీఆర్‌డీఎఫ్ఏ అధికారితో మాట్లాడవచ్చు" అని సంబంధిత అధికారి ఒకరు స్పష్టం చేశారు.

UAE: 3నెలల విజిట్ వీసాలను నిలిపివేసిన యూఏఈ.. ప్రస్తుతం విజిటర్లకు అందుబాటులో ఉన్న ఇతర లాంగ్‌టర్మ్ వీసా ఆప్షన్లు ఇవే..

అంతేగాక ఈ విధానం చాలా సులువు, చాలా సమయాన్ని ఆదా చేస్తుందని తెలిపారు. దరఖాస్తుదారు వర్చువల్ సర్వీస్‌ను రిమోట్‌గా యాక్సెస్ చేసుకోవచ్చన్నారు. దరఖాస్తుదారుల సమస్యలను పరిష్కరించేందుకు చాట్ బాక్స్‌లో కొత్త పత్రాన్ని జత చేస్తారు. దరఖాస్తుదారు వ్యక్తిగతంగా దీన్ని ఆప్లై చేయవలసిన అవసరం లేదు. వర్చువల్ అమెర్ సర్వీస్ లావాదేవీ సమయాన్ని సేవ్ చేస్తుంది. అదే సమయంలో వినియోగదారులకు ప్రక్రియను చాలా సులభతరం చేస్తుందని జీడీఆర్ఎఫ్ఏ (GDRFA) అధికారి చెప్పుకొచ్చారు. ఇక అన్ని రకాల వీసాలు.. రెసిడెన్సీ, స్టూడెంట్, విజిట్, గోల్డెన్, గ్రీన్ వీసాలను జారీ చేయడంతో పాటు పునరుద్ధరణకు వర్చువల్ సర్వీస్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇప్పటికే వ్యక్తిగతంగా దరఖాస్తు చేసిన కస్టమర్‌ల ఆలస్యాన్ని పరిష్కరించడానికి ఈ వీడియో కాన్ఫరెన్సింగ్ ఉపయోగడుతుంది. అన్ని ధృవపత్రాలు కరెక్ట్‌గా ఉంటే ఈ ప్రక్రియ మరింత వేగంగా పూర్తవుతుందని అధికారి స్పష్టం చేశారు.

ప్రణాళిక విస్తరణ ఇలా..

జీడీఆర్ఎఫ్ఏ-దుబాయ్ 2023 మొదటి త్రైమాసికంలో వీడియో కాల్ సర్వీస్‌ను ప్రారంభించింది. దీంతో మొదటి రెండు నెలల్లోనే ఏకంగా 2.50లక్షల లావాదేవీలు ప్రాసెస్ చేయబడ్డాయి. ప్రస్తుతం వర్చువల్ అమెర్ సర్వీస్ వారాంతపు రోజులలో (సోమవారం నుండి శుక్రవారం వరకు) ఉదయం 7 నుండి సాయంత్రం 7 గంటల వరకు అందుబాటులో ఉంది. అయితే, దీనిని 24/7 చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఇక వర్చువల్ అమెర్ సర్వీస్‌తో పాటు కస్టమర్‌లు అమెర్ కాల్ సెంటర్‌ను టోల్-ఫ్రీ నంబర్ 8005111లో కూడా సంప్రదించవచ్చు. ఇది 24 గంటలు అందుబాటులో ఉంటుంది.

No passport, no visa: మరో స్మార్ట్ ఆలోచనతో ముందుకు వచ్చిన దుబాయ్.. ఎలాంటి ట్రావెల్ డాక్యుమెంట్స్ లేకుండానే..

Updated Date - 2023-10-21T08:53:37+05:30 IST