NRI: ఢిల్లీ విమానాశ్రయంలో ఎన్నారైల కోసం ఫెసిలిటేషన్ సెంటర్
ABN , First Publish Date - 2023-08-12T13:57:19+05:30 IST
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Indira Gandhi International Airport) లో ఎన్నారైలు, ఇతర ప్రయాణికుల కోసం ఫెసిలిటేషన్ సెంటర్ (Facilitation centre) ను ఏర్పాటు చేయాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సెంటర్‌లో 24 గంటలూ సిబ్బంది ఉంటారు.

NRI: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Indira Gandhi International Airport) లో ఎన్నారైలు, ఇతర ప్రయాణికుల కోసం ఫెసిలిటేషన్ సెంటర్ (Facilitation centre) ను ఏర్పాటు చేయాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సెంటర్‌లో 24 గంటలూ సిబ్బంది ఉంటారు. వారు అందించే సేవలలో అరైవల్ అండ్ కనెక్ట్ ఫ్లైట్ సమాచారం, టాక్సీ సేవలు, సామాను కోల్పోయిన వారికి సహాయం, పంజాబ్ భవన్ ఇతర సమీప స్థానాలకు స్థానిక రవాణ వంటివి ఉంటాయి. అలాగే సరసమైన ధరలకు అందించే క్యాబ్ సర్వీసులతో ఈ సెంటర్ టై-అప్‌లను కలిగి ఉంటుంది. అంతేగాక ప్రయాణీకులు విమానాశ్రయం సమీపంలోని ప్రదేశాలకు వెళ్లేందుకు దాని సొంత వాహనాలను కలిగి ఉంటుంది.
ఎన్నారైలు (NRIs), ఇతర ప్రయాణీకులు విమానాశ్రయానికి (Airport) చేరుకున్నప్పుడు వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పంజాబ్ గవర్నమెంట్ చేసిన మంచి కార్యక్రమం ఇది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఫెసిలిటేషన్ సెంటర్ (Facilitation Center) అంతర్జాతీయ టెర్మినల్‌లోని అరైవల్ హాల్‌లో ఉంటుంది. ఇందులో బహూ భాషలు మాట్లాడగలిగే ట్రైన్డ్ సిబ్బంది ఉంటారు. ఇక ఈ సెంటర్ 24/7 తెరిచే ఉంటుంది. ఎన్నారైలు, ఇతర ప్రయాణీకులందరికీ ఈ కేంద్రం పూర్తి ఉచితంగా సేవలను అందిస్తుంది.