Indian Student: 'ఇది కదా దేశభక్తి అంటే'.. ఈ భారతీయ విద్యార్థి వీడియో చూస్తే గూస్‌బమ్స్‌ రావడం పక్కా!

ABN , First Publish Date - 2023-08-12T08:21:10+05:30 IST

విదేశాల్లో ఓ భారతీయ విద్యార్థి (Indian Student) చూపించిన దేశభక్తి (Patriotism) పట్ల అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 'ఇది కదా దేశభక్తి అంటే..' అని మనోడ్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

Indian Student: 'ఇది కదా దేశభక్తి అంటే'.. ఈ భారతీయ విద్యార్థి వీడియో చూస్తే గూస్‌బమ్స్‌ రావడం పక్కా!

ఎన్నారై డెస్క్: విదేశాల్లో ఓ భారతీయ విద్యార్థి (Indian Student) చూపించిన దేశభక్తి (Patriotism) పట్ల అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 'ఇది కదా దేశభక్తి అంటే..' అని మనోడ్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ప్రస్తుతం భారతీయ విద్యార్థి తాలూకు వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. విద్యార్థులకు డిగ్రీ పట్టాల ప్రదానోత్సవం (Convocation Ceremony) జరుగుతోంది. ప్రొఫెసర్స్, కళాశాల యాజమాన్యం ఒక్కో స్టూడెంట్‌ను వేదికపైకి ఆహ్వానించి వారి చేతికి డిగ్రీ పట్టాను అందిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడే చదువుకున్న భారతీయ విద్యార్థి వంతు వచ్చింది. మనోడు అందరిలా కాకుండా ఓ ప్రత్యేక వేషధారణలో స్టేజీపైకి ఎక్కాడు.

అందరూ ప్యాంటు, షర్టు వేసుకుని వస్తే.. మనోడు మాత్రం సంప్రదాయబద్ధంగా కుర్తా, పైజామా ధరించాడు. వస్తూ వస్తూనే అక్కడున్న పెద్దల అనుమతి తీసుకుని.. డిగ్రీ పట్టా అందుకోవడానికి ముందే.. తనతో పాటు తీసుకెళ్లిన మన జాతీయ పతాకాన్ని (Indian National Flag) జేబులోంచి తీసి ప్రదర్శించాడు. మువ్వన్నెల జెండా పట్టుకుని వేదిక చుట్టూ తిరిగాడు. అలా మనోడు జాతీయ జెండాను పట్టుకొని తిరిగిన ఆ దృశ్యాన్ని చూస్తే గూస్‌బమ్స్‌(Goosebumps) రావడం ఖాయం. అది చూసి అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టారు. ఇది ఏ దేశంలోనో తెలియదుగానీ.. దీని తాలూకు వీడియోను మిని త్రిపాఠి (@Mini_Tripathii) అనే ట్విటర్ యూజర్ పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు భారతీయ విద్యార్థి దేశభక్తిని మెచ్చుకుంటున్నారు.

Heartbroken: అయ్యో పాపం.. పదేళ్ల తర్వాత కొడుకును వెతుక్కుంటూ యూఏఈ వెళ్లిన భారతీయ దంపతులు.. చివరికి

Updated Date - 2023-08-12T08:49:27+05:30 IST