Kuwait: మళ్లీ తెరపైకి జనాభా అసమతుల్యత.. ప్రవాసుల కోటాపై ఎంపీల కీలక ప్రతిపాదన..!

ABN , First Publish Date - 2023-07-26T07:44:41+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్‌ (Kuwait) లో మరోసారి జనాభా అసమతుల్యత చర్చనీయాంశంగా మారింది.

Kuwait: మళ్లీ తెరపైకి జనాభా అసమతుల్యత.. ప్రవాసుల కోటాపై ఎంపీల కీలక ప్రతిపాదన..!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌ (Kuwait) లో మరోసారి జనాభా అసమతుల్యత చర్చనీయాంశంగా మారింది. ప్రవాస జనాభా అంతకంతకు పెరిగిపోవడంతో స్థానికులకు ఉపాధి అవకాశాలు దొరకడం లేదంటూ కువైత్ ఎంపీలు మళ్లీ గళమెత్తారు. గత జాతీయ అసెంబ్లీలో సమర్పించిన ప్రవాసుల కోటా ప్రతిపాదనను పునరుద్ధరించాలంటూ తాజాగా ఎంపీల బృందం గవర్నమెంట్‌ను కోరింది. వెంటనే తమ ప్రతిపాదనను అమలు పరచాలని, ఏ సందర్భంలోనూ సంతృప్తి చెందవద్దని ప్రభుత్వానికి ఎంపీలు కోరారు.

ప్రధానంగా పౌరుల సంఖ్యకు సంబంధించి ఇతర జాతీయుల గరిష్ట శాతాన్ని నిర్ణయించే, కువైత్‌లోని పెద్ద ప్రవాస సంఘాల (Expat Communities) నుంచి ప్రత్యేకించి కువైత్ పౌరుల కంటే అధిక జన సాంద్రత కలిగిన వ్యక్తుల నియామకాలను నిషేధించే చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని ఎంపీల బృందం ప్రతిపాదించింది. దీని ప్రకారం ప్రతి ప్రవాస కమ్యూనిటీ నుంచి వ్యక్తుల సంఖ్య కువైటీల సంఖ్య కంటే పది శాతానికి మించకూడదని వారు పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను అమలు చేస్తే జనాభా అసమతుల్యతను సరిచేయడం చాలా సులువు అని ఎంపీల బృందం ప్రభుత్వానికి తెలియజేసింది.

Duty Free Draw: జర్నీ చేస్తూ సరదాగా కొన్న లాటరీ టికెట్.. భారతీయుడికి రూ.8 కోట్లు తెచ్చిపెట్టింది.. తీరా రాఫెల్ నిర్వాహకులు ఫోన్ చేస్తే..!


Updated Date - 2023-07-26T07:44:41+05:30 IST