Michigan Shooting: సరిగ్గా పదేళ్ల తర్వాత ఈ యువతి జీవితంలో సేమ్ సీన్ రిపీట్.. చావు నుంచి రెండు సార్లు తృటిలో తప్పించుకుంది..!

ABN , First Publish Date - 2023-02-15T14:11:07+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలోని మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ క్యాంపస్‌లో (Michigan State University Campus) సోమవారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా, మరో ఐదుగురు గాయపడ్డ విషయం తెలసిందే.

Michigan Shooting: సరిగ్గా పదేళ్ల తర్వాత ఈ యువతి జీవితంలో సేమ్ సీన్ రిపీట్.. చావు నుంచి రెండు సార్లు తృటిలో తప్పించుకుంది..!

మిచిగాన్: అగ్రరాజ్యం అమెరికాలోని మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ క్యాంపస్‌లో (Michigan State University Campus) సోమవారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందగా, మరో ఐదుగురు గాయపడ్డ విషయం తెలసిందే. ఓ సాయుధుడు యూనివర్శిటీ క్యాంపస్‌లోకి చోరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఇక ఈ సంఘటన జరిగిన నాలుగు గంటల తర్వాత దుండుగుడు తనను తాను కాల్చుకుని, ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఇదిలాఉంటే.. ఈ సంఘటన సమయంలో అదే క్యాంపస్‌లో ఉన్న ఓ విద్యార్థిని అసలేం జరిగిందో వీడియో ద్వారా తెలియజేసింది. అలాగే సరిగ్గా పదేళ్ల ముందు కూడా ఆమెకు ఇలాంటి సంఘటన ఒకటి ఎదురైన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. ఆమె పేరు జాకీ మ్యాథ్యూస్ (Jackie Matthews). ప్రస్తుతం మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ క్యాంప్‌లో ఉంటుంది. సోమవార రాత్రి సంఘటన అనంతరం టిక్‌టాక్ వీడియో (TikTok Video) ద్వారా అసలు ఏం జరిగిందనే విషయాన్ని తెలియజేసింది. సరిగ్గా కాల్పులు జరుగుతున్న సమయంలో ఆమె అదే ప్రదేశాన్ని దాటుతున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ వీడియోను ఆమె మంగళవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో పోస్ట్ చేసింది. అంటే.. సంఘటన జరిగిన సుమారు 4 గంటల తర్వాత అన్నమాట. వీడియోలో 'నాకు 21ఏళ్లు. ఇది నా జీవితంలో రెండో కాల్పుల సంఘటన' అని చెప్పిన మ్యాథ్యూస్.. సరిగ్గా పదేళ్ల కింద ఆమె స్కూల్ ఉండగా జరిగిన మొదటి సంఘటనను గుర్తు చేసింది.

ఇది కూడా చదవండి: కొత్త రూల్.. ప్రయాణీకులందరూ తప్పనిసరిగా ఆ వివరాలు వెల్లడించాల్సిందేనట..!

2012, డిసెంబర్ 14న ఆమె క్లాస్‌రూంలో ఉండగా ఆ కాల్పులు చోటు చేసుకున్నాయని, న్యూటన్‌లోని కనెక్టికట్‌ ఈ సంఘటన జరిగిందని తెలిపింది. ఆ రోజు 20 మంది చిన్నారులతో సహా 26 మంది చనిపోయారని ఆమె పేర్కొంది. ఆ సమయంలో తాను కూడా గాయపడినట్లు చెప్పింది. ఇలా సరిగ్గా పదేళ్ల తర్వాత తన జీవితంలో సేమ్ సీన్ రిపీట్ అయిందని, చావు నుంచి రెండు సార్లు తృటిలో తప్పించుకున్నట్లు చెప్పుకొచ్చింది."ఇలాంటి చర్యలు సరైనవి కావు. ఇలాంటివి మునుముందు జరగకుండా ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి. ఇలాంటివాటిని ఎట్టిపరిస్థితుల్లో అనుమతించలేము. నేను ఎప్పటికీ శాండీ హుక్ స్ట్రాంగ్‌గా ఉంటాను. నేను ఎప్పటికీ స్పార్టన్ స్ట్రాంగ్‌గా ఉంటాను." అని మ్యాథ్యూస్ తెలిపింది.

Updated Date - 2023-02-15T14:14:32+05:30 IST