Expats: 100 మంది ప్రవాసులను దేశం నుంచి వెళ్లగొట్టిన కువైత్.. కారణమిదే..!

ABN , First Publish Date - 2023-08-08T09:34:38+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ గత కొంతకాలంగా ప్రవాసుల (Expatriates) పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే రెసిడెన్సీ, వర్క్ పర్మిట్లను కఠినతరం చేసిన కువైత్.. ఉల్లంఘనలకు పాల్పడే వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది.

Expats: 100 మంది ప్రవాసులను దేశం నుంచి వెళ్లగొట్టిన కువైత్.. కారణమిదే..!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ గత కొంతకాలంగా ప్రవాసుల (Expatriates) పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే రెసిడెన్సీ, వర్క్ పర్మిట్లను కఠినతరం చేసిన కువైత్.. ఉల్లంఘనలకు పాల్పడే వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా 100 మంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించింది. రెండు నెలల వ్యవధిలోనే ఇంత భారీ మొత్తంలో ప్రవాసులను దేశం నుంచి వెళ్లగొట్టింది. వీరంతా లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం, అతివేగం, రోడ్డుపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు ప్రయాణికులను రవాణా చేయడానికి వ్యక్తిగత వాహనాలను ఉపయోగించడం వంటి తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు (Traffic Violations) పాల్పడ్డారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Interior Ministry) లోని జనరల్ ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ మేజర్ జనరల్ యూసఫ్ అల్-ఖాదా ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ట్రాఫిక్ పెట్రోలింగ్ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.

అలాగే భారీ సంఖ్యలో ప్రవాసులు నివసిస్తున్న, పని చేస్తున్న ప్రాంతాల్లో సమగ్ర ప్రణాళికను అమలు చేస్తోంది. దీనిలో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్‌ (Driving licenses) లను తనిఖీ చేయడం, వాహనాల మన్నికను పరిశీలించడం, అలాగే తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే ప్రవాసుల (Expats) ను బహిష్కరించడంతో పాటు ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం వంటివి ఈ ప్రణాళికలో ఉన్నాయని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

Visit visas: ఆ ఎనిమిది దేశాల పర్యాటకులకు సౌదీ గుడ్‌న్యూస్


Updated Date - 2023-08-08T09:34:38+05:30 IST