Kuwait: స్వదేశానికి వచ్చే ప్రవాసులు జర జాగ్రత్త.. 24 గంటల వ్యవధిలో 70 మందిపై ట్రావెల్ బ్యాన్..!

ABN , First Publish Date - 2023-08-22T08:22:40+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) ఈ నెల 19వ తేదీ నుంచి ఏ కారణంతోనైన సరే కువైత్ విడిచిపెట్టి వెళ్లే ప్రవాసులు (Expats) ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి జరిమానాలు ఉంటే చెల్లించడం తప్పనిసరి అని ప్రకటించిన విషయం తెలిసిందే. లేనిపక్షంలో వారి ప్రయాణాలపై నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది.

Kuwait: స్వదేశానికి వచ్చే ప్రవాసులు జర జాగ్రత్త.. 24 గంటల వ్యవధిలో 70 మందిపై ట్రావెల్ బ్యాన్..!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) ఈ నెల 19వ తేదీ నుంచి ఏ కారణంతోనైన సరే కువైత్ విడిచిపెట్టి వెళ్లే ప్రవాసులు (Expats) ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి జరిమానాలు ఉంటే చెల్లించడం తప్పనిసరి అని ప్రకటించిన విషయం తెలిసిందే. లేనిపక్షంలో వారి ప్రయాణాలపై నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం అమలులోకి వచ్చిన 24 గంటల వ్యవధిలోనే 70 మంది ప్రవాసులపై చర్యలకు ఉపక్రమించింది. ట్రాఫిక్ చలాన్లు చెల్లించన కారణంగా వారిపై ట్రావెల్ బ్యాన్ (Travel Ban) విధించినట్లు ఆ దేశ అంతర్గత మంత్రిత్వ శాఖ (Ministry of Interior) పేర్కొంది. ప్రయాణ నిషేధం ఎదుర్కొంటున్న వారిలో 50 మంది పురుషులు, 20 మంది మహిళలు ఉన్నారని తెలిపింది. వారి వద్ద నుంచి జరిమానాల రూపంలో 66వేల కువైటీ దినార్లు (రూ. 1.77కోట్లు) వసూలు చేసినట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది. దేశం విడిచి వెళ్లే ప్రవాసులందరూ ట్రాఫిక్ ఉల్లంఘనలను సమీక్షించుకోవాలని, ప్రయాణంలో జాప్యాన్ని నివారించడానికి చలాన్లను ముందుగానే క్లియర్ చేసుకోవాలని ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ సూచించింది.

కాగా, దేశం విడిచిపెట్టి వెళ్లే ముందు ట్రాఫిక్ ఫైన్స్ ఉన్న విదేశీయులు (Foreigners) మంత్రిత్వశాఖకు చెందిన అధికారిక ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా (లేదా) ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ ఆఫీస్‌లో (లేదా) విమానాశ్రయంలోని ఆఫీస్‌లో (లేదా) బార్డర్ పోర్ట్ వద్ద ఏర్పాటు చేసిన కార్యాలయంలో చెల్లించవచ్చని తెలిపింది. ఈ సందర్భంగా ప్రతి ప్రవాసుడు (Expat) చట్టానికి కట్టుబడి ఉండాలని, వాటిని ఉల్లంఘించవద్దని మంత్రిత్వ శాఖ సూచించింది. అలాగే సామరస్యపూర్వకమైన, చట్టబద్ధమైన వాతావరణాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో వ్యక్తులందరూ ఏర్పాటు చేసిన ఈ చట్టపరమైన నిబంధనలను పాటించాలని, వాటి ఉల్లంఘనలను నివారించాలని సంబంధిత అధికారులు కోరారు. ఇక ఈ చర్యకు చట్టపరమైన ఆధారంగా ఫారినర్స్ రెసిడెన్స్ లా డిక్రీ నంబర్ (17/1959), ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన డిక్రీ-లా నంబర్ (67/1976) ను పేర్కొంది.

NRI: విషాదం.. యూఎస్‌లో భారతీయ కుటుంబం అనుమానాస్పద మృతి.. ఇంట్లోనే విగతజీవులుగా దంపతులు, ఆరేళ్ళ కొడుకు!


Updated Date - 2023-08-22T08:22:40+05:30 IST