NRI: సింగపూర్‌ హోటల్‌లో గొడవ.. భారత సంతతి వ్యక్తి అరెస్ట్.. మరణశిక్ష పడే అవకాశం..!

ABN , First Publish Date - 2023-08-24T10:00:37+05:30 IST

ఓ వ్యక్తి హత్య కేసులో భారత సంతతి వ్యక్తి (Indian origin man) ని సింగపూర్ పోలీసులు (Singapore Police) అదుపులోకి తీసుకున్నారు.

NRI: సింగపూర్‌ హోటల్‌లో గొడవ.. భారత సంతతి వ్యక్తి అరెస్ట్.. మరణశిక్ష పడే అవకాశం..!

NRI: ఓ వ్యక్తి హత్య కేసులో భారత సంతతి వ్యక్తి (Indian origin man) ని సింగపూర్ పోలీసులు (Singapore Police) అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురు వ్యక్తులు మారణాయుధాలతో అల్లర్లకు పాల్పడినట్లుగా అక్కడి ప్రముఖ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. కాంకోర్డ్ హోటల్ అండ్ షాపింగ్ మాల్‌లో (Concorde Hotel and Shopping Mall) ఆదివారం జరిగిన ఈ గొడవలో మొహమ్మద్ ఇస్రత్ మహ్మద్ ఇస్మాయిల్‌ (Mohammad Isrrat Mohd Ismail) అనే వ్యక్తిని హత్య చేసినట్లుగా భారతీయుడైన అశ్వయిన్ పచాన్ పిళ్లై సుకుమారన్‌ (Asvain Pachan Pillai Sukumaran) పై ఆరోపణలు ఉన్నాయి. అతడిని అరెస్ట్ తర్వాత పోలీసులు వీడియో లింక్ ద్వారా మంగళవారం న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు.

ప్రస్తుతం విచారణ దశలో ఉన్న ఈ కేసులో హత్యా నేరం కనుక రుజువైతే మాత్రం అశ్వయిన్ పచాన్ పిళ్లైకు కోర్టు మరణశిక్ష (Death Sentence) విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అలాగే మారణాయుధాలతో అల్లర్లకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న ఆరుగురిపై నేరం రుజువైతే ఒక్కొక్కరికి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశాలు ఉంది. ఇక ఏడవ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ప్రమాదకరమైన ఆయుధంతో గాయపరిచినట్లు దోషిగా తేలితే అతడికి ఏడేళ్ల వరకు జైలు, భారీ జరిమానా తప్పదని న్యాయ నిపుణులు అన్నారు.

Kuwait: ప్రవాసులు బీ అలెర్ట్.. సెప్టెంటర్ 1వ తారీఖు నుంచి కొత్త నిబంధన.. అలా చేశారో స్వదేశానికి రావడం కష్టం..!


Updated Date - 2023-08-24T10:00:37+05:30 IST