Share News

Emirates Draw: ఇతడు ఎంత అదృష్టవంతుడో.. నెలనెలా రూ.5.6 లక్షలు.. అలా 25 ఏళ్లపాటు..!

ABN , First Publish Date - 2023-10-21T11:02:34+05:30 IST

అదృష్టం అనేది ఎప్పుడు.. ఎవరిని.. ఎలా వరిస్తుందో చెప్పలేం. లాటరీ విషయానికొస్తే బంపరాఫర్ కోట్ల మందిలో ఒక్కరినే వరిస్తుంది. అలాంటి అదృష్టం తమకే రావాలంటూ ప్రతి ఒక్కరూ అదృష్ట దేవతను ప్రార్థిస్తుంటారు కూడా.

Emirates Draw: ఇతడు ఎంత అదృష్టవంతుడో.. నెలనెలా రూ.5.6 లక్షలు.. అలా 25 ఏళ్లపాటు..!

ఎన్నారై డెస్క్: అదృష్టం అనేది ఎప్పుడు.. ఎవరిని.. ఎలా వరిస్తుందో చెప్పలేం. లాటరీ విషయానికొస్తే బంపరాఫర్ కోట్ల మందిలో ఒక్కరినే వరిస్తుంది. అలాంటి అదృష్టం తమకే రావాలంటూ ప్రతి ఒక్కరూ అదృష్ట దేవతను ప్రార్థిస్తుంటారు కూడా. దానిలో భాగంగా క్రమం తప్పకుండా లాటరీలు కొంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఒక్కసారి అదృష్టం వరిస్తే రాత్రికి రాత్రే జీవితం మారిపోతుంది. ఇదిగో ఈ భారత ప్రవాసుడి (Indian Expat) విషయంలో అదే జరిగింది. ఎమిరేట్స్ డ్రాలో మనోడికి జాక్‌పాట్ తగిలింది. ఇక నుంచి భారత వ్యక్తికి 25ఏళ్ల పాటు ప్రతినెల 25వేల దిర్హమ్స్ (రూ.5.66లక్షలు) వస్తాయి. 'ఫాస్ట్5 ఎమిరేట్స్ డ్రా' (FAST5 Emirates draw) లో కేవలం 25 దిర్హమ్స్ పెట్టి కొన్న టికెట్‌కు తమిళనాడుకు చెందిన మగేష్ కుమార్ నటరాజన్ (Magesh Kumar Natarajan) అనే భారత వ్యక్తికి ఇలా అదృష్టం వరించింది. దీంతో నటరాజన్ మొదటి గ్లోబల్ గ్రాండ్ ప్రైజ్ విజేతగా నిలిచారు. అలాగే యూఏఈ యేతర తొలి విన్నర్‌ కూడా అతడే. 49 ఏళ్ల నటరాజన్ ప్రస్తుతం తమిళనాడులోని అంబూర్‌లో ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అంతకుముందు 2019 నుంచి 2023 ప్రారంభం వరకు సౌదీ అరేబియాలోనే ఉన్నాడు. దుబాయ్ వెళ్తున్న సమయంలో ఎమిరేట్స్ డ్రా గురించి తెలుసుకుని 'ఫాస్ట్5'లో టికెట్ కొనుగోలు చేయడం, జాక్‌పాట్ తగలడం జరిగిపోయాయి.

UAE Visas: రెసిడెన్సీ నుంచి గోల్డెన్ వీసా వరకు.. ఇంట్లో నుంచే రెన్యువల్ చేసుకోవచ్చు.. ఎలాగంటే..

ఈ సందర్భంగా మగేష్ కుమార్ నటరాజన్ మాట్లాడుతూ.. "మొదట యాప్‌లో తనిఖీ చేసినప్పుడు నేను కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నంబర్‌లోని ఐదు అంకెలు కరెక్ట్‌గా సరిపోయాయి. కానీ, అది నమ్మశక్యం కాలేదు. ఎమిరేట్స్ డ్రా (Emirates Draw) నిర్వాహకుల నుంచి కాల్ రావడంతో నమ్మాను" అని చెప్పాడు. ఇక తాను గెలిచిన గ్రాండ్ ప్రైజ్‌మనీలో కొంత భాగం సమాజ సేవకు వినియోగిస్తానని తెలిపాడు. తాను చదువుకునే రోజుల్లో ఎంతోమంది తనకు అవసరం ఉన్నప్పుడు సాయం చేశారని, ఇప్పుడు తనకు సమాజానికి తిరిగి ఇచ్చే అవకాశం వచ్చిందని పేర్కొన్నాడు. అలాగే తన కుమార్తెలకు ఉన్నత విద్య, కుటుంబానికి ఉజ్వల భవిష్యత్తును అందించాలని కూడా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇదిలాఉంటే.. ఇదే 'ఫాస్ట్5 ఎమిరేట్స్ డ్రా' మొదటి విజేత కూడా భారతీయ వ్యక్తినే కావడం గమనార్హం. దుబాయిలో ఐదేళ్లుగా ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్‌గా పని చేస్తున్న 33ఏళ్ల అదిల్ ఖాన్‌కు ఈ జాక్‌పాట్ తగిలింది.

UAE: 3నెలల విజిట్ వీసాలను నిలిపివేసిన యూఏఈ.. ప్రస్తుతం విజిటర్లకు అందుబాటులో ఉన్న ఇతర లాంగ్‌టర్మ్ వీసా ఆప్షన్లు ఇవే..

Updated Date - 2023-10-21T11:04:28+05:30 IST