Share News

Indian Embassy: కువైత్‌లోని ఇండియన్ డెలవరీ డ్రైవర్లకు ఎంబసీ కీలక సూచనలు.. ఏమాత్రం అలసత్వం ప్రదర్శించిన భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనంటూ..

ABN , First Publish Date - 2023-12-05T08:44:00+05:30 IST

కువైత్‌లోని వలసదారులలో భారతీయ ప్రవాసులే అధికంగా ఉంటారనే విషయం తెలిసిందే. వర్క్ పర్మిట్, రెసిడెన్సీ వీసాల విషయంలో గల్ఫ్ దేశం ఇప్పటికే కఠిన నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ భారత్ నుంచి ఆ దేశానికి ప్రతియేట భారీ సంఖ్యలోనే ఉపాధి కోసం వెళ్తున్నారు.

Indian Embassy: కువైత్‌లోని ఇండియన్ డెలవరీ డ్రైవర్లకు ఎంబసీ కీలక సూచనలు.. ఏమాత్రం అలసత్వం ప్రదర్శించిన భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనంటూ..

కువైత్ సిటీ: కువైత్‌లోని వలసదారులలో భారతీయ ప్రవాసులే అధికంగా ఉంటారనే విషయం తెలిసిందే. వర్క్ పర్మిట్, రెసిడెన్సీ వీసాల విషయంలో గల్ఫ్ దేశం ఇప్పటికే కఠిన నిబంధనలు అమలు చేస్తున్నప్పటికీ భారత్ నుంచి ఆ దేశానికి ప్రతియేట భారీ సంఖ్యలోనే ఉపాధి కోసం వెళ్తున్నారు. దీంతో కువైత్‌లో మనవాళ్ల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కువైత్‌లోని భారత రాయబార కార్యాలయం తాజాగా మనోళ్లకు కీలక సూచనలు చేసింది. ప్రధానంగా డెలివరీ డ్రైవర్లు (Delivery Drivers) గా చేస్తున్న భారతీయులను దృష్టిలో పెట్టుకుని ఈ అడ్వైజరీని విడుదల చేసింది. ఇప్పటికే ఈ వృత్తిలో కొనసాగుతున్నవారితో కొత్తగా పనిలో చేరుతున్నవారు తప్పనిసరిగా ఈ సూచనలు పాటించాలని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) పేర్కొంది. రెస్టారెంట్ డ్రైవర్లుగా నియమించుకునే యాజమాన్యాలు వీరిని డెలివరీ డ్రైవర్లు/ రైడర్స్ ఫర్ ఫుడ్ ప్లాట్‌ఫారమ్స్‌గా ఉద్యోగాలు ఇస్తుంటాయని ఎంబసీ తెలిపింది. ఇటీవల కాలంలో కువైత్ వస్తున్న భారతీయుల్లో (Indians) చాలామంది ఇవే ఉద్యోగాల్లో చేరుతున్నందున రాయబార కార్యాలయం ఈ సూచనలు చేస్తున్నట్లు తెలిపింది.

Indians: కువైత్‌లోని ప్రవాసులకు ముఖ్య గమనిక.. డిసెంబర్ 6వ తారీఖున ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో..


ఎంబసీ చేసిన కీలక సూచనలు ఇవే..

* డెలివరీ డ్రైవర్లకు చిన్న-మధ్యతరహా పరిశ్రమలు వీసాలు జారీ చేస్తుంటాయి. ఈ వీసాతో ఒకే యజమాని వద్ద మూడేళ్ల పాటు పని చేయాల్సి ఉంటుంది. ఈ మూడేళ్ల కాలపరిమితిలో వేరే యజమాని వద్దకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం లేదా విడుదల చేయడం అనేది ఉండదు. మూడేళ్ల తర్వాత మరో యజమాని వద్దకు మారొచ్చు. లేదా స్వదేశానికి వచ్చేయవచ్చు.

* శాలరీ అనేది కమీషన్ రూపంలో ఉంటుంది. డెలవరీ టార్గెట్, డిస్టేన్స్‌ను బట్టి ఈ కమీషన్ ఉంటుంది. ఒకవేళ ఏజెంట్లు ఫిక్సడ్ శాలరీలు ఉంటాయని చెబితే నమ్మొద్దని, ఏ కంపెనీలు కూడా డెలవరీ డ్రైవర్లకు ఫిక్సడ్ వేతనాలు ఇవ్వవని ఎంబసీ తెలిపింది.

* ఇక జాబ్‌లో చేరడానికి ముందే యజమానితో చేసుకునే కాంట్రాక్ట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ కాంట్రాక్ట్‌లో పనిగంటలు, ఓవర్‌టైమ్ పే, సెలవు రోజుల్లో పనికి అదనంగా చెల్లింపు, వర్కర్ ఆరోగ్యంతో పాటు సేఫ్టీ, ఒకవేళ ప్రమాదం జరిగి మంచానికి పరిమితమైతే పరిహారం చెల్లింపులు తదితర విషయాలను కూలంకషంగా తెలుసుకోవాలని రాయబారా కార్యాలయం పేర్కొంది.

* కువైత్‌లో కొన్ని నెలల పాటు వాతావరణం చాలా కఠినంగా ఉంటుందనే విషయం డ్రైవర్లు ముందే తెలుసుకోవాలి. బాగా వేడి, డస్ట్ తుఫాన్లు వస్తుంటాయని తెలిపింది.

* కార్మికులు వారి సొంత భద్రత, శ్రేయస్సు కోసం వారికి వైద్య/ప్రమాద బీమా అందించబడిందని నిర్ధారించుకోవాలి.

* డెలివరీ రైడర్‌లందరూ తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి భారత ప్రభుత్వం సూచించిన ఎంబసీ అటెస్టెడ్ ఎంప్లాయ్‌మెంట్ కాంట్రాక్ట్‌ల (కువైట్‌లోని కార్మిక చట్టాల ప్రకారం డెలివరీ డెలివరీ డ్రైవర్లకు KD 120 కనీస వేతనాలతో) కోసం యజమానిని అడగాలి.

* ఎంబసీ ద్వారా పొందే ఉపాధి ఒప్పంద ధృవీకరణ పత్రం కువై‌త్‌లో బీమా కవరేజీని (వైకల్యం/ప్రమాదం/మరణ పరిహారం తదితర అంశాలను ఇది కవర్ చేస్తుంది) కలిగి ఉంటుంది. దీన్ని కువైత్ యజమాని చెల్లించాలి.

* ప్రొటెక్టర్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్ ఆఫీస్ నుండి ఎమిగ్రేషన్ క్లియరెన్స్ పొందేటప్పుడు కార్మికులు ప్రవాసీ భారతీయ బీమా యోజన (PBBY) అదనపు బీమా ప్రయోజనాన్ని కూడా పొందుతారు.

* ఏదైనా కార్మిక ఫిర్యాదులు/వివాదాల విషయంలో ప్రవాసులు ముందుగా పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్‌పవర్ (PAM) కి ఫిర్యాదు చేయాలి.

* అలాగే భారత ఎంబసీ ఏర్పాటు చేసిన లేబర్ హెల్ప్‌డెస్క్‌లో వ్యక్తిగతంగా లేదా వాట్సాప్ హెల్ప్‌లైన్ నం. 65501769 ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.

NRIs: అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం.. ముగ్గురు నరరూప రాక్షసులు.. 20 ఏళ్ల యువకుడిని 7నెలల పాటు..!

Updated Date - 2023-12-05T08:46:36+05:30 IST