Kuwait: భారత ప్రవాసులకు ఎంబసీ కీలక సూచన.. మార్చి 31వ తేదీన తప్పనిసరిగా..

ABN , First Publish Date - 2023-03-30T11:17:58+05:30 IST

కువైత్‌లోని భారత ఎంబసీ (Indian Embassy) ప్రవాసులకు కీలక సూచన చేసింది.

Kuwait: భారత ప్రవాసులకు ఎంబసీ కీలక సూచన.. మార్చి 31వ తేదీన తప్పనిసరిగా..

కువైత్ సిటీ: కువైత్‌లోని భారత ఎంబసీ (Indian Embassy) ప్రవాసులకు కీలక సూచన చేసింది. మార్చి 31వ తేదీన (శుక్రవారం) జహ్రాలో కాన్సులర్, మెడికల్ క్యాంప్ (Consular and Medical Camp) నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. వాహా ప్రాంతంలోని (Waha Area) డొడీ కిడ్స్ నర్సరీ స్కూల్‌లో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ శిబిరం ఉంటుంది. ప్రవాసులు ఈ క్యాంప్ ద్వారా తమకు కావాల్సిన సర్వీసులను పొందవచ్చని భారత రాయబారి డా. ఆదర్శ్ స్వైకా (Dr. Adarsh Swaika) తెలిపారు. జహ్రాలోని భారత రాయబార కార్యాలయం అందించే అన్ని సేవలు శుక్రవారం ఈ కాన్సులర్, మెడికల్ క్యాంప్ అందిస్తుందని అంబాసిడర్ వెల్లడించారు. కావున భారత ప్రవాసులు (Indian Expats) ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ఇక ఈ క్యాంపులో భాగంగా పాస్‌పోర్ట్ రెన్యువల్ (Passport Renewal), రిలేషన్‌షిప్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్‌తో (Driving License) పాటు సిగ్నేచర్ అటెస్టేషన్, ఇతర జనరల్ అటెస్టేషన్ సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఎంబసీ అధికారులు వెల్లండించారు. కాగా, మెడికల్ క్యాంపులో భాగంగా కువైత్‌లోని ఇండియన్ డాక్టర్స్ ఫోరమ్ (Indian Doctors Forum) కలిసి ఎంబసీ మెడికల్ ప్రవాసులకు కన్సల్టేషన్‌ను కూడా అందిస్తోంది. ఇది భారతీయ వైద్యులకు పరిమిత ప్రాప్యత ఉన్న జహ్రా ప్రాంతంలో నివసిస్తున్న భారతీయ ప్రవాసులకు ఎక్కువగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఐడీఎఫ్ (IDF) నుండి భారతీయ వైద్యులు శిబిరంలో భారతీయ జాతీయులకు ఉచితంగా మెడికల్ కన్సల్టేషన్‌ను (Medical Consultation) అందిస్తారు. ఇదిలాఉంటే.. ఎంబసీ గత నెలలో వఫ్రా (Wafra) ప్రాంతంలో ఒక కాన్సులర్ క్యాంపును (Consular Camp) నిర్వహించిన విషయం తెలిసిందే. ఇది ఆ ప్రాంతంలోని పెద్ద సంఖ్యలో భారతీయ ప్రవాసులకు భారీ ప్రయోజనం చేకూర్చింది.

ఇది కూడా చదవండి: ఐపీఎస్ అధికారి కూతురి డెత్ మిస్టరీ.. 3 వారాల క్రితమే అమెరికాకు వెళ్లిన 23 ఏళ్ల యువతి.. బర్త్‌డే కూడా ఘనంగా చేసుకుంది కానీ..

Updated Date - 2023-03-30T11:17:58+05:30 IST