NRI: అగ్రరాజ్యం అధ్యక్ష రేసులో మరో భారతీయ అమెరికన్.. ఎవరీ హర్ష్‌వర్ధన్ సింగ్..?

ABN , First Publish Date - 2023-07-30T09:33:33+05:30 IST

అమెరికా అధ్య‌క్ష ప‌ద‌వి రేసులోమ‌రో భారతీయ అమెరికన్ (Indian American) నిలిచారు. ఇంజినీర్ అయిన హర్ష్‌వర్ధన్ సింగ్ (Hirsh Vardhan Singh) యూఎస్ 2024 అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు.

NRI: అగ్రరాజ్యం అధ్యక్ష రేసులో మరో భారతీయ అమెరికన్.. ఎవరీ హర్ష్‌వర్ధన్ సింగ్..?

NRI: అమెరికా అధ్య‌క్ష ప‌ద‌వి రేసులోమ‌రో భారతీయ అమెరికన్ (Indian American) నిలిచారు. ఇంజినీర్ అయిన హర్ష్‌వర్ధన్ సింగ్ (Hirsh Vardhan Singh) యూఎస్ 2024 అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు. తన అభ్యర్థిత్వాన్ని ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ (Federal Election Commission) వద్ద ఆయన గురువారం నమోదు చేసుకున్నారు. కాగా, ఇప్పటికే ఇద్దరు ప్రవాస భారతీయులైన నిక్కీ హేలీ (Nikki Haley), వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) ఈ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలోకి మూడో అభ్యర్థిగా హర్ష్‌వర్ధన్ సింగ్ చేరారు.

ఇక ఈ ముగ్గురు కూడా రిపబ్లికన్ పార్టీ (Republican Party) తరపున పోటీలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలాఉంటే.. ఇప్ప‌టికే రిపబ్లికన్ పార్టీకే చెందిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మళ్లీ పోటీ చేస్తానని ప్రకటించిన విషయం విదితమే. అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థుల విషయంలో రిపబ్లికన్లలో తీవ్ర పోటీ నెలకొన్న విషయం దీంతో స్పష్టమవుతోంది. అయితే, ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీలో ఎవరు ఉండాలనేది మాత్రం రిపబ్లికన్ల జాతీయ సదస్సు నిర్ధారిస్తుంది.

Indians.jpg

Emirates draw: అదృష్టం అంటే ఈ భారత ప్రవాసుడిదే.. ప్రతినెల రూ.5.60లక్షలు.. అది కూడా 25ఏళ్ల వరకు..!

ఇక తాను కూడా అమెరికా అధ్యక్ష బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించిన హర్ష్‌వర్ధన్ సింగ్ శుక్రవారం మూడు నిమిషాల నిడివి గల ఓ వీడియోను ఓ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. "గత కొన్ని సంవత్సరాలుగా వచ్చిన మార్పులను తిప్పికొట్టడానికి, అమెరికన్ విలువలను పునరుద్ధరించడానికి మనకు బలమైన నాయకత్వం అవసరం. అందుకే నేను యునైటెడ్ స్టేట్స్ అధ్యక్ష పదవికి 2024 ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాన్ని కోరాలని నిర్ణయించుకున్నాను" అని సింగ్ చెప్పారు. కాగా, ఆయన 2017, 2021లో న్యూజెర్సీ గవర్నర్‌గా రిపబ్లికన్ ప్రైమరీలలో, 2018లో హౌస్ సీటుకు, 2020లో సెనేట్‌కు పోటీ చేసినప్పటికీ రిపబ్లికన్ పార్టీ నామినేషన్‌ను గెలుచుకోవడంలో విఫలమయ్యారు. అలాగే ఈసారి కూడా హేమాహేమీల మధ్య ఆయనకు నామినేషన్ దక్కడం అంత సులువు ఏమీ కాదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

UK Visa: భారతీయ యువ వృత్తి నిపుణులకు బ్రిటన్ గుడ్‌న్యూస్

Updated Date - 2023-07-30T09:39:34+05:30 IST