US Shocker: భారతీయ అమెరికన్ చేసిన నీచం ఇది.. దోషిగా తేల్చిన కోర్టు.. 50ఏళ్ల జైలు, రూ.4కోట్ల వరకు జరిమానా!

ABN , First Publish Date - 2023-03-04T12:29:28+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో ఓ భారతీయ అమెరికన్ (India American) నీచానికి పాల్పడ్డాడు.

US Shocker: భారతీయ అమెరికన్ చేసిన నీచం ఇది.. దోషిగా తేల్చిన కోర్టు.. 50ఏళ్ల జైలు, రూ.4కోట్ల వరకు జరిమానా!

న్యూయార్క్: అగ్రరాజ్యం అమెరికాలో ఓ భారతీయ అమెరికన్ (India American) నీచానికి పాల్పడ్డాడు. అభంశుభం తెలియని మైనర్లతో శృంగారంలో పాల్గొని వాటి తాలూకు ఫొటోలు, వీడియోలను 30 ఆన్‌లైన్‌ వెబ్‌సైట్లలో పెట్టి సొమ్ము చేసుకున్నాడు. ఇటీవల అతడి బాగోతం బయటపడడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హాజరు పరిచారు. సదరు భారత వ్యక్తి చేసిన నీచానికి సంబంధించిన ఆధారాలను సైతం కోర్టు ముందు ఉంచారు. వాటిని పరిశీలించిన న్యాయస్థానం భారత సంతతి వ్యక్తిని దోషిగా తేల్చింది. త్వరలోనే అతడికి కోర్టు శిక్షను ఖరారు చేయనుంది.

వివరాల్లోకి వెళ్తే.. మయాంక్ ఎం పటేల్ (27) అనే భారతీయ అమెరికన్ వ్యక్తి కెంటుకీలోని లెక్సింగ్టన్‌లో (Lexington) నివాసం ఉంటున్నాడు. అయితే, గత కొంతకాలంగా మనోడు చిన్నపిల్లలతో కామక్రీడల్లో మునిగి తేలుతూ వాటి తాలూకు ఫొటోలు, వీడియోలను ఆన్‌లైన్‌లో పెట్టి సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల కెంటుకీ స్టేట్ పోలీస్ (Kentucky State Police) విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్ క్రైమ్ బ్రాంచ్ సభ్యులకు సమాచారం అందింది. దాంతో పోలీసులు ఈ ఏడాది జవనవరి 23న పటేల్ ఇంట్లో ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో అతడి ఇంట్లో కీలక ఆధారాలు దొరికాయి. ముఖ్యంగా పటేల్ ఐఫోన్, యాపిల్ మ్యాక్‌బుక్‌లో పిల్లలతో అభ్యంతరకర స్థితిలో ఉన్న ఫొటోలు, వీడియోలు కనిపించాయి.

ఇది కూడా చదవండి: మీకు టూరిస్ట్ వీసా ఉంటే చాలు.. కెనడాలో రెండేళ్లు ఎంచక్కా పని చేసుకోవచ్చు..!

వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అతడి ఫోన్ నంబర్‌‌ను చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన పదుల సంఖ్యలలో ఆన్‌లైన్ కమ్యూనిటీలో రిజిస్టర్ అయ్యి ఉండడం గుర్తించారు. అనంతరం అతడిని అరెస్ట్ చేశారు. తాజాగా యూఎస్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో హాజరుపరిచారు. పటేల్‌కు సంబంధించి పోలీసులు సేకరించిన ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానంలో.. అందులో ఓ ఏడేళ్ల చిన్నారితో అభ్యంతరకర స్థితిలో ఉన్న ఫొటో, వీడియోను గుర్తించింది. ఇది క్షమించరాని నేరమని పేర్కొంటూ అతడిని కోర్టు దోషిగా తేల్చింది. త్వరలోనే పటేల్‌కు శిక్ష ఖరారు కానుంది. అయితే, న్యాయ నిపుణులు చెబుతున్న దాని ప్రకారం దోషిగా తేలిన పటేల్‌కు 50 ఏళ్ల జైలు, 5లక్షల డాలర్ల వరకు (రూ. 4కోట్ల) జరిమానా పడే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని కలలు కనే భారతీయులకు జర్మనీ గుడ్ న్యూస్.. ఇకపై ఆ దేశానికి వెళ్లడం యమా ఈజీ..!

Updated Date - 2023-03-04T12:29:28+05:30 IST