Abu Dhabi Big Ticket: జాక్‌‌పాట్ కొట్టిన హైదరాబాదీ డ్రైవర్‌.. ఎంత గెలుచుకున్నాడంటే..

ABN , First Publish Date - 2023-09-16T13:52:50+05:30 IST

బిగ్ టికెట్ అబుదాబి వీక్లీ డ్రా (Big Ticket Abu Dhabi weekly draw) లో ఒమన్‌లో ఉంటున్న హైదరాబాదీ జాక్‌‌పాట్ కొట్టాడు. నరేష్ కుమార్ అనే డ్రైవర్ 1లక్ష దిర్హామ్స్ (రూ. 22.63లక్షలు) గెలుచుకున్నాడు.

Abu Dhabi Big Ticket: జాక్‌‌పాట్ కొట్టిన హైదరాబాదీ డ్రైవర్‌.. ఎంత గెలుచుకున్నాడంటే..

Abu Dhabi Big Ticket: బిగ్ టికెట్ అబుదాబి వీక్లీ డ్రా (Big Ticket Abu Dhabi weekly draw) లో ఒమన్‌లో ఉంటున్న హైదరాబాదీ జాక్‌‌పాట్ కొట్టాడు. నరేష్ కుమార్ అనే డ్రైవర్ 1లక్ష దిర్హామ్స్ (రూ. 22.63లక్షలు) గెలుచుకున్నాడు. అతడు కొనుగోలు చేసిన లాటరీ నంబర్. 141484కి ఈ జాక్‌పాట్ తగిలింది. ఒక ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న నరేష్ కుమార్ గత 10 సంవత్సరాల నుంచి మస్కట్‌లో ఉంటున్నాడు. సహోద్యోగులు, స్నేహితుల ఇలా పది మందితో కలిసి గత నాలుగేళ్లుగా బిగ్ టికెట్ డ్రాలో పాల్గొంటున్నాడు. చివరికి అతనికి అదృష్టం వరించడంతో భారీ మొత్తం గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా నరేష్ కుమార్ మాట్లాడుతూ.. "చాలా సంతోషంగా ఉంది. ఇంత భారీ మొత్తం గెలుచుకున్నానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను" అని హర్షం వ్యక్తం చేశారు. తాను గెలిచిన ప్రైజ్‌మనీ (Prize money) తో హైదరాబాద్‌లో బిజినెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.

UAE: మీ వద్ద ఈ 3 వీసాలు ఉంటే చాలు.. యూఏఈలో పని చేయకుండా కూడా.. రెసిడెన్సీకి ఇట్టే అనుమతి పొందవచ్చు!

Updated Date - 2023-09-16T13:52:50+05:30 IST