TANA: తానా మహాసభలకు.. ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు

ABN , First Publish Date - 2023-06-07T18:33:33+05:30 IST

ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7, 8, 9 తేదీల్లో జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలకు ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరవనున్నారు. ఈ మేరకు...

TANA: తానా మహాసభలకు.. ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు

ఫిలడెల్ఫియా (అమెరికా): ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో జూలై 7, 8, 9 తేదీల్లో జరగనున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) (తానా) 23వ మహాసభలకు ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Former Vice President Venkaiah Naidu) హాజరవనున్నారు. ఈ మేరకు తానా (TANA) అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరి ప్రకటన విడుదల చేశారు.

తానాతో ఎంతో అనుబంధం ఉన్న వెంకయ్య నాయుడు.. గతంలో పలు కార్యక్రమాలు, మహాసభల్లో పాల్గొని ప్రసంగించి ఆకట్టుకున్నారని వారు గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా హైదరాబాద్‌లో (Hyderabad) ఇటీవల జరిగిన తానా కళారాధన కార్యక్రమంలో కూడా వెంకయ్య నాయుడు పాల్గొని తానా సేవలను, తెలుగు భాషకు తానా చేస్తున్న సేవను ప్రశంసించారన్నారు. ప్రస్తుతం వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరవడం తానా మహాసభలకు మరో ఆకర్షణగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.

Updated Date - 2023-06-07T18:33:42+05:30 IST