Emirates Draw: ఈమె ఎంత అదృష్టవంతురాలు.. పని చేయకుండానే నెలనెలా రూ.5.65 లక్షలు.. అలా 25 ఏళ్లపాటు..!

ABN , First Publish Date - 2023-09-24T09:59:15+05:30 IST

ఏ పని చేయకుండా.. నెలనెలా లక్ష రూపాయలు వస్తే ఎలా ఉంటది? అలా ఒక నెల, సంవత్సరం కాదు. ఏకంగా 25 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా వస్తే! ఇంకేంటి ప్రతిరోజూ పండగే కదా.

Emirates Draw: ఈమె ఎంత అదృష్టవంతురాలు.. పని చేయకుండానే నెలనెలా రూ.5.65 లక్షలు.. అలా 25 ఏళ్లపాటు..!

దుబాయ్: ఏ పని చేయకుండా.. నెలనెలా లక్ష రూపాయలు వస్తే ఎలా ఉంటది? అలా ఒక నెల, సంవత్సరం కాదు. ఏకంగా 25 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా వస్తే! ఇంకేంటి ప్రతిరోజూ పండగే కదా. ఇదిగో ఇప్పుడు ఇక్కడ చెప్పుకోబోయే ఓ మహిళ విషయం ఇదే జరగనుంది. ఆమె ఏ పని చేయకపోయినా సరే.. ప్రతి నెలా ఆమె బ్యాంక్ ఖాతాలో రూ.5.65 లక్షలు జమ అవుతాయి. అది కూడా 25 ఏళ్ల పాటు ప్రతి నెల ఆమె ఖాతాలో ఇలా రూ. 5.65 లక్షల రూపాయలు జమ అవుతాయి. వామ్మో ఎవరా అదృష్టవంతురాలు? ఎందుకు ఆమెకి ఆ బంపరాఫర్‌ అనుకుంటున్నారా? అయితే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ‘ఫాస్ట్‌ 5’ (FAST 5) పేరిట నిర్వహించిన మెగా ప్రైజ్‌ మనీ లక్కీ డ్రాలో ఫిలిప్పీన్స్‌కు చెందిన ఓ మహిళకు ఈ భారీ అదృష్టం వరించింది. దాంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఆమె పేరు ఫ్రీలిన్ అంగోబ్ (Freilyn Angob). ఈమె ఫ్యామిలీ గత పదేళ్లుగా యూఏఈ (UAE) లో ఉంటుంది. ఆమె తండ్రి స్థానికంగా ఒక చిన్న స్టోర్ నడిపిస్తున్నాడు. దాంతోనే వారి జీవనం కొనసాగుతోంది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం అంగోబ్.. ‘ఫాస్ట్‌ 5’ పేరిట నిర్వహించే లాటరీ టిక్కెట్‌ను కొనుగోలు చేసింది. ఏదో సరదాగా ఆ టికెట్‌ కొనుగోలు చేసిందామె. కానీ నిజంగానే తనకు ఇలాంటి అదృష్టం వస్తుందని అంగోబ్ ఏమాత్రం ఊహిచలేదు.

కానీ, మనకు దక్కాలని రాసి పెట్టి ఉంటే.. అది తప్పకుండా మనకు దక్కే తీరుతుంది. ఇదిగో అంగోబ్ విషయంలో ఇదే జరిగింది. ఇంకేముంది తాజాగా నిర్వహించిన మెగా ప్రైజ్‌ మనీ లక్కీ డ్రాలో ఆమె విజేతగా నిలిచినట్టు నిర్వాహకులు వెల్లడించారు. ఇక ఆ లాటరీ నిబంధనల ప్రకారం విజేతకు ప్రతి నెలా 25వేల దిర్హమ్స్ (రూ.5.65లక్షలు) చొప్పున 25 ఏళ్లపాటు అందజేస్తారు. తనను వరించిన ఈ అదృష్టం పట్ల అంగోబ్ ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మెగా ప్రైజ్‌ మనీ లక్కీ డ్రాలో విజేతగా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పిన ఆమె.. తనకు జీవితంలో అత్యంత ముఖ్యమైన సమయంలో ఇంత భారీ మొత్తం రాబోతున్నందుకు హర్షం వ్యక్తం చేసింది. తన కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమేనని, ఇలాంటి సమయంలో ఈ భారీ నగదు తమకు ఎంతో సహాయంగా ఉంటుందని చెప్పుకొచ్చింది.

Big Ticket: అదృష్టం అంటే ఈ భారతీయ డ్రైవర్‌దే.. ఒక్కసారి లాటరీ తగలడమే కష్టం అనుకుంటే.. మనోడికి ఏకంగా..

Updated Date - 2023-09-24T10:03:43+05:30 IST