DTC: కెనడాలో అంబరాన్నంటిన డుర్హం తెలుగు క్లబ్  ఉగాది వేడుకలు

ABN , First Publish Date - 2023-03-28T07:28:48+05:30 IST

కెనడా ఒంటారియో రాష్ట్రంలోని ఆశావా నగరంలో శోభాకృత నామ సంవత్సర ఉగాది వేడుకలను (Ugadi Celebrations) ఎన్నారైలు అత్యద్భుతంగా నిర్వహించారు.

DTC: కెనడాలో అంబరాన్నంటిన డుర్హం తెలుగు క్లబ్  ఉగాది వేడుకలు

ఎన్నారై డెస్క్: కెనడా ఒంటారియో రాష్ట్రంలోని ఆశావా నగరంలో శోభాకృత నామ సంవత్సర ఉగాది వేడుకలను (Ugadi Celebrations) ఎన్నారైలు అత్యద్భుతంగా నిర్వహించారు. డుర్హం తెలుగు క్లబ్ (Durham Telugu Club) వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు ముఖ్య అతిథిగా కెనడా లీడర్ పియర్ పోలీవతో పాటు ఆశావా, వాన్ నగర ఎంపీలు హాజరయ్యారు.

DDD.jpg

డుర్హం రీజియన్‌లో నివసిస్తున్న తెలుగు వారందరూ వారి వారి కుటుంబ సభ్యులతో వేడుకలలో పాల్గొన్నారు. పంచాంగ శ్రవణంతో ప్రారంభమైన వేడుకలు పిల్ల పాపల కేరింతలతో, ఆట పాటలతో ప్రాంగణం హోరెత్తిపోయింది.

DDDDDD.jpg

ముఖ్య అతిథి పియర్ పోలీవ మాట్లాడుతూ ఎంతో మంది భారతీయులు, ఇతర దేశస్థులు కెనడాలో స్థిర నివాసం ఏర్పరచుకుంటున్నారు. ధరల నియంత్రణ, శాంతి భద్రతలు, నాణ్యమైన జీవన ప్రణామాలు, స్వేచ్ఛ  సమాజం తన అభిమతం అని వాటి సాధన కోసం తాను శ్రమిస్తానని తెలియజేశారు.

DDDDD.jpg

డీటీసీ అధ్యక్షుడు గుత్తిరెడ్డి నరసింహారెడ్డి మాట్లాడుతూ, ఉగాది ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలలో ప్రసిద్ధి పండుగ. మేము ప్రతి సంవత్సరం ఏప్రిల్‌లో  చైత్రమాసంలో కొత్త సంవత్సరం ప్రారంభానికి గుర్తుగా జరుపుకుంటామని తెలిపారు. టొరంటో నగరంలో వివిధ రంగాలలో రాణిస్తున్న తెలుగు వారికి ఉగాది పురస్కారాలతో డీటీసీ అధ్యక్షుడు గుత్తిరెడ్డి నరసింహారెడ్డి, కమిటీ కార్యవర్గ సభ్యుల సత్కరించారు.

D.jpg

అతిథులకు ష్రడ్రుచులతో తెలుగు ఇంటి రుచులతో ఆహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డుర్హం తెలుగు క్లబ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు సర్ధార్ ఖాన్, రవి మేకల, వెంకట్ చిలువేరు, రమేష్ ఉప్పలపాటి, శ్రీకాంత్ సింగిసేథీ, గుణ శేఖర్ కూనపల్లి, గౌతమ్ పిడపర్తి, కమల మూర్తి, వాసు, యుజి చెరుకూరు పాల్గొన్నారు.

DD.jpg

ఏ దేశమేగినా ఎందు కాలెడినా.. ఏ పీఠమెక్కినా.. ఎవ్వరేమనినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలపరా నీ జాతి నిండు గౌరవము అన్న సూక్తులతో సభ ఘనంగా ముగిసింది.

DDDD.jpg

Updated Date - 2023-03-28T07:28:48+05:30 IST