Kuwait: బ్యాచిలర్స్‌కు కువైత్ బిగ్ షాక్.. ఇకపై..

ABN , First Publish Date - 2023-06-07T10:09:37+05:30 IST

కువైత్ మున్సిపాలిటీ (Kuwait Municipality) బ్యాచిలర్స్‌కు బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది.

Kuwait: బ్యాచిలర్స్‌కు కువైత్ బిగ్ షాక్.. ఇకపై..

కువైత్ సిటీ: కువైత్ మున్సిపాలిటీ (Kuwait Municipality) బ్యాచిలర్స్‌కు బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అయింది. ఖైతాన్‌లోని బ్యాచిలర్స్ నివాసం (Bachelors Residing) ఉంటున్న భవనాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు మున్సిపాలిటీ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కువైత్ మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్ సౌద్ అల్ దబ్బౌస్ మీడియాతో మాట్లాడారు. ప్రైవేట్, మోడల్ రెసిడెన్సీ ఏరియాలలో 'బ్యాచిలర్స్ హౌసింగ్' (Bachelors Housing) అనేది సమస్యగా మారిందన్నారు. ఇకపై ఫ్యామిలీ రెసిడెన్సీ ప్రాంతాలలో నివసించే బ్యాచిలర్స్‌పై (Bachelors) తమ చర్యలు కొనసాగుతాయని తెలిపారు. విద్యుత్ నిలిచిపోయే వ్యక్తులు తమ ఇళ్లను ఖాళీ చేయమని ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా వాటిని పాటించలేదని అల్ దబ్బౌస్ వెల్లడించారు. ఇక మన్సిపాలిటీ నివేదిక ప్రకారం 1150కి పైగా ఇళ్లను వివిధ పరిసర ప్రాంతాలలో బ్యాచిలర్స్ కోసం వసతిగా ఉపయోగిస్తున్నట్లు తేలిందన్నారు.

Updated Date - 2023-06-07T10:09:37+05:30 IST