Kuwait: ప్రవాస ఇంజనీర్ల సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌లో షాకింగ్ విషయాలు.. నలుగురు భారతీయులు..

ABN , First Publish Date - 2022-12-09T11:58:42+05:30 IST

కువైత్‌లో ఫేక్ సర్టిఫికేట్ల (Fake Certificates) ద్వారా చాలా మంది ప్రవాసులు (Expats) ఉపాధి పొందుతున్నట్లు గ్రహించిన అక్కడి సర్కార్ ముందుగా ఇంజనీరింగ్ విభాగంలో ప్రక్షాళన మొదలెట్టింది.

Kuwait: ప్రవాస ఇంజనీర్ల సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌లో షాకింగ్ విషయాలు.. నలుగురు భారతీయులు..

కువైత్ సిటీ: కువైత్‌లో ఫేక్ సర్టిఫికేట్ల (Fake Certificates) ద్వారా చాలా మంది ప్రవాసులు (Expats) ఉపాధి పొందుతున్నట్లు గ్రహించిన అక్కడి సర్కార్ ముందుగా ఇంజనీరింగ్ విభాగంలో ప్రక్షాళన మొదలెట్టింది. దీనికోసం ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్ ద్వారా ప్రస్తుతం ప్రవాస ఇంజనీర్ల సర్టిఫికెట్ స్క్రీనింగ్ కొనసాగుతోంది. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ సహాకారంతో కువైత్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ (Kuwait Society of Engineers) ప్రవాస ఇంజనీర్లు తాము ఉద్యోగాల్లో చేరినప్పుడు సమర్పించిన సర్టిఫికెట్లను వెరిఫై చేస్తోంది. తాజా నివేదిక ప్రకారం ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా ప్రవాసులు సమర్పించిన మొత్తం 5,248 సర్టిఫికెట్లలో గత ఆరు నెలల్లో 4,320 ఇంజనీరింగ్ సర్టిఫికేట్‌లను వివిధ దేశాల నివాసితులు ధృవీకరణ కోసం సమర్పించారు.

ఇక ధృవీకరణలో ఏడు నకిలీ ఇంజినీరింగ్ సర్టిఫికెట్లను (Engineering Certificates) గుర్తించడం జరిగింది. వాటిలో నాలుగు భారత ప్రవాసులకు సంబంధించినవి కాగా, మిగిలినవి వెనిజులా, జోర్డానియన్, ఈజిప్టియన్లకు చెందినవి. 74 సర్టిఫికెట్లు ఇంకా వెరిఫై కాలేదని, 928 ఇంజినీరింగ్ సర్టిఫికెట్లు ప్రస్తుతం వెరిఫై అవుతున్నాయని నివేదిక సూచించింది. కువైత్ సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్‌ అధికారిక సమాచారం ప్రకారం ఫోర్జర్‌లు, ఇంజనీర్లుగా పనిచేయడానికి రిక్రూట్‌మెంట్ వీసా జారీ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ధృవీకరించింది. ఇకపై కువైత్‌లో పని చేస్తున్న ప్రవాస ఇంజనీర్ల విషయంలో పాత, కొత్త అనే తేడా లేకుండా వారు అందించే ధృవీకరణ పత్రాలను సొసైటీ క్రమం తప్పకుండా వెరిఫై చేస్తూనే ఉంటుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.

Updated Date - 2022-12-09T12:08:16+05:30 IST