CBN: డబ్లిన్‌లో ఘనంగా చంద్రబాబు బర్త్‌డే వేడుకలు

ABN , First Publish Date - 2023-04-22T07:58:36+05:30 IST

నవయువమేధో శ్రామికులు, శ్వాప్నికులు, భావితరాల భవిష్యత్తుకు భరోసా నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదిన వేడుకలు ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ నగరంలో ఎన్నారై టీడీపీ ఐర్లాండ్ (TDP Ireland NRI Comitte) సభ్యులు ఘనంగా నిర్వహించారు.

CBN: డబ్లిన్‌లో ఘనంగా చంద్రబాబు బర్త్‌డే వేడుకలు

డబ్లిన్‌: నవయువమేధో శ్రామికులు, శ్వాప్నికులు, భావితరాల భవిష్యత్తుకు భరోసా నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదిన వేడుకలు ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ నగరంలో ఎన్నారై టీడీపీ ఐర్లాండ్ (TDP Ireland NRI Comitte) సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్బంగా చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాల్సిన ఆవశ్యకతని వ్యక్తం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా రాష్ట్రం అధిరోహించిన ప్రగతి శిఖరాలను చూసి ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను బేరీజు వేస్తూ సభ్యులు విచారం వ్యక్తం చేశారు. సైకో పాలనకు స్వస్తి పలికి సైకిల్ పాలనకు నాంది పలకాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.

CC.jpg

ఈ వేడుకల్లో రీజియనల్ కోఆర్డినేటర్ డా.కిషోర్ బాబు చలసాని సమన్వయంతో టీడీపీ ఐర్లాండ్ తెలుగు మహిళా అధ్యక్షురాలు సీత కేకే కట్ చేసి సభ్యులకు పంచారు. ప్రెసిడెంట్ భాష్యం భరత్ ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు రంగ గల్లా, యశ్వంత్ మడకశిర, కాట్రగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్, నరేంద్ర, శివబాబు, రామకృష్ణ, విజయ్, రాంబాబు పరిస, అరుణ్ అంధవరపు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.

Updated Date - 2023-04-22T07:58:36+05:30 IST