Share News

BRS NRI Qatar: తెలంగాణ ఎన్నికల్లో కారు, నూరు, కేసీఆరు ఖాయం: శ్రీధర్ అబ్బగౌని

ABN , First Publish Date - 2023-11-01T07:32:55+05:30 IST

తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఎన్నారైల నుండి బీఆర్ఎస్‌కు పెద్ద ఎత్తున మద్దతు పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా నవంబర్ 30న జరగనున్న సాధారణ ఎన్నికల కోసం 50కి పైగా దేశాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్నారైలు పార్టీ తరఫున ప్రచారాన్ని మొదలు పెడుతున్నారు.

BRS NRI Qatar: తెలంగాణ ఎన్నికల్లో కారు, నూరు, కేసీఆరు ఖాయం: శ్రీధర్ అబ్బగౌని

మెదక్ ఎంపీపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం: బీఆర్ఎస్ ఖతర్ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని

BRS NRI Qatar: తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఎన్నారైల నుండి బీఆర్ఎస్‌కు పెద్ద ఎత్తున మద్దతు పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా నవంబర్ 30న జరగనున్న సాధారణ ఎన్నికల కోసం 50కి పైగా దేశాల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్నారైలు పార్టీ తరఫున ప్రచారాన్ని మొదలు పెడుతున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఖతర్ శాఖ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బాగౌని ఆధ్వర్యంలో దోహాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల్లో తమవంతు పాత్ర పోషించే విధంగా కార్యాచరణ రూపొందించి ప్రచారాన్ని పారభిస్తామని తెలిపారు. ఎన్నికలు ఏవైనా ఎన్నారైలు, వారి కుటుంబాలు బీఆర్ఎస్ వెంటే అన్నారు.

శ్రీధర్ అబ్బగొని మాట్లాడుతూ.. ఓటమి భయంతో కాంగ్రెస్ హత్యా రాజకీయాలకు తెర తీసిందని అన్నారు. మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థిపై కాంగ్రెస్ గుండా హత్యాయత్నం చేయడం దారుణమని తెలిపారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. శాంతియుతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ హత్యా రాజకీయాలకు, మతతత్వ రాజకీయాలకు ప్రజలు బీఆర్ఎస్‌కు ఓటు వేసి బుద్ది చెపుతారని చెప్పారు. గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ రాష్ట్ర ఎన్నారైలతోనే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్, యూపీ, తమిళనాడు, కేరళ ఎన్నారైల నుండి కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు వస్తుందని తెలిపారు. దీనికి కారణం దేశంలో అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అభివృద్ధి వారిని ఆకర్షిస్తోందన్నారు.

ముఖ్యంగా ఎన్నారైలు బీఆర్ఎస్‌కు మద్దతుగా నిలువడానికి కారణం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, ఉపాధి కల్పన అని పేర్కొన్నారు. దీని వల్ల గతంతో పోలిస్తే 2014 నుండి వలసలు తగ్గడం నిదర్శనం అన్నారు. కేసిఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మొట్ట మొదటి సారి హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టిస్తుందని జోస్యం చెప్పారు. అలాగే కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా దక్కవు అన్నారు. 50కి పైగా సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన కాంగ్రెస్ తెలంగాణ ప్రాంతాన్ని వెనుకబాటుకు గురి చేసిందని విమర్శించారు. మళ్ళీ కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంటు, నీళ్ళ కష్టాలు తప్పవన్నారు.

BRS-NRI.jpg

ఇక బీజేపీకి మతకలహాలు చేయడం తప్ప అభివృద్ధి చేయడం చాతకాదని దుయ్యబట్టారు. కర్ణాటక రైతుల పరిస్థితి పెనం మీద నుండి పోయ్యిల పడ్డట్టు అయ్యిందని, రైతులు కరెంటు కష్టాలతో మొసళ్ళ వదులుతున్నారు అన్నారు. 5 గంటల కరెంట్ మాత్రమే ఇస్తాం అని స్వయంగా అక్కడి సీఎం ప్రకటించడం విడ్డూరం అన్నారు. గత ప్రభుత్వాలు రైతుల నుండి డబ్బులు వసూలు చేస్తే, కేసీఆర్ రైతులకు డబ్బులు ఇస్తున్నారు. దీన్ని దుబారా ఖర్చు అని గత పీసీసీ అధ్యక్షుడు అనడం వారికి రైతుల మీద ఉన్న కపట ప్రేమను తెలియజేస్తుందన్నారు.

బీఆర్ఎస్ మెనిఫెస్టో అద్భుతమని ఈ సమావేశంలో ఎన్నారైలు అన్నారు. రూ. 400లకే గ్యాస్ సిలిండర్ అన్నది గేమ్ చెంజర్‌గా పేర్కొన్నారు. సౌభాగ్య లక్ష్మి ద్వారా ఆడబిడ్డలకు 3 వేలు ఇచ్చి కేసీఆర్ మహిళలకు మద్దతుగా నిలిచారన్నారు. రాష్ట్రంలో రేషన్ కార్డులు ఉన్న వాళ్లకు 6 కిలోల సన్నబియ్యం అనేది గత పాలకుల ఆలోచనకు అండ లేదు ఎందుకు అని ప్రశ్నించారు. కేసీఆర్ భీమా రాష్ట్ర ప్రజానీకానికి ధీమా అన్నారు. 93 లక్షల కుటుంబాలకు భీమా కల్పిస్తాం అన్న హామీతో కేసీఆర్ ప్రతి ఇంటికి పెద్ద కొడుకు అని మళ్ళీ ఒకసారి నిరూపించుకున్నారు అన్నారు. బీఆర్ఎస్ ఇంకోన్నేళ్లు ప్రత్యామ్నాయం లేదు అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెసు, బీజేపీలకు భంగ పాటు తప్పదని చెప్పుకొచ్చారు.

Updated Date - 2023-11-01T07:34:11+05:30 IST