TANA: బే ఏరియాలో 'భక్తా బల్లా' వేడుకలు విజయవంతం!

ABN , First Publish Date - 2023-08-30T09:39:46+05:30 IST

గతంలో 'తానా' ఫౌండేషన్ ట్రస్టీగా భక్తా బల్లా మిగిలిన రెండేళ్ల పదవీ కాలాన్నితాను అభిమానించే ప్రియమైన నాయకుడు జయరాం కోమటి సలహాతో 'తానా' శ్రేయస్సు కొరకు త్యాగం చేసిన విషయం తెలిసిందే.

TANA: బే ఏరియాలో 'భక్తా బల్లా' వేడుకలు విజయవంతం!

'తానా' ఫౌండేషన్ ట్రస్టీగా తిరిగి భక్తా బల్లా

TANA: గతంలో 'తానా' ఫౌండేషన్ ట్రస్టీగా భక్తా బల్లా మిగిలిన రెండేళ్ల పదవీ కాలాన్నితాను అభిమానించే ప్రియమైన నాయకుడు జయరాం కోమటి సలహాతో 'తానా' శ్రేయస్సు కొరకు త్యాగం చేసిన విషయం తెలిసిందే. ఈ సారి 'తానా' ఎన్నికల ప్రక్రియను అర్ధాంతరంగా రద్దు చేసి, మూడు వర్గాలు పదవుల్ని పంచుకొనే ప్రక్రియలో తిరిగి గతంలో పనిచేసిన ఫౌండేషన్ ట్రస్టీ పదవికి ఎంపికయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎల్లవేళలా తన శ్రేయస్సు కోరుకునే తన మిత్ర బృందానికి, శ్రేయోభిలాషులకు బే ఏరియాలో భక్తా బల్లా భారీ స్థాయిలో వేడుకలు నిర్వహించారు.

భక్తా బల్లా ఎంపికపై ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు. వారంతా ఈ కార్యక్రమానికి వచ్చి భక్తా బల్లా మంచి మనసు గురించి గొప్పగా చెబుతూ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా భక్తా బల్లా వ్యక్తిత్వం గురించి, ఆయన దయగుణం గురించి మిత్రులు ఎన్నో ఉదాహరణలు చెప్పారు. త్వరలో తానా అధ్యక్ష స్థాయికి కూడా చేరుకోవాలని వారు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన భక్తా బల్లా తన మిత్రులు, సన్నిహితులు, శ్రేయోభిలాషుల సహాయ సహకారాలతో అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు.

తన సహాయం కోరి వచ్చిన వారికి ఎల్లవేళలా భక్తా బల్లా అందుబాటులో ఉంటూ తోచిన సాయం చేస్తారు. తన మిత్రులు, శ్రేయోభిలాషుల సహాయసహకారాలు, ప్రేమాప్యాయలతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని భక్తా బల్లా అన్నారు. 'Your Voice Is My Voice' అనే క్రొత్త నినాదంతో ముందుకు సాగుతానని ప్రకటించారు. ప్రత్యేకించి జయరాం కోమటి తనకు అందించిన మద్దతు వెలకట్టలేనిదని ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. తన ఎంపిక సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ పార్టీకి సహాయ సహకారాలు అందచేసిన మిత్రుడు వెంకట్ జెట్టికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Updated Date - 2023-08-30T09:39:46+05:30 IST