Texas Mall Shooting: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ పేలిన తూటా.. టీనేజీ యువతి సహా 9 మంది మృతి!

ABN , First Publish Date - 2023-05-07T08:42:27+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో (America) మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్ పరిధిలోని అలెన్ ప్రాంతంలో ఉన్న అలెన్ ప్రీమియం అవుట్‌లెట్స్ మాల్‌లో..

Texas Mall Shooting: అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ పేలిన తూటా.. టీనేజీ యువతి సహా 9 మంది మృతి!

కాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికాలో (America) మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. కాలిఫోర్నియాలో (California) శనివారం సాయంత్రం స్థానిక టెక్సాస్ మాల్‌లో గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో టీనేజీ యువతి సహా 9 మంది చనిపోయారు. మరో 7 మంది వరకు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దుండగుడిని కాల్చిచంపినట్లు సమాచారం. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా, మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అలెన్ పోలీసులు పేర్కొన్నారు. టెక్సాస్ పరిధిలోని అలెన్ ప్రాంతంలో ఉన్న అలెన్ ప్రీమియం అవుట్‌లెట్స్ మాల్‌లో (Allen Premium Outlets mall) ఈ ఘటన చోటు చేసుకుందని సీటీ పోలీస్ చీఫ్ బ్రియాన్ హార్వే (Brian Harvey) వెల్లడించారు.

ఇక ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. మాల్ నుంచి బయటకు వస్తున్న వందలాది మందిపై దుండగుడు తనతో పాటు తెచ్చుకున్న తుపాకీతో ఒక్కసారిగా కాల్పులకు తెగబడినట్లు గుర్తించారు. ఈ ఘటనపై టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ (Texas Governor Greg Abbott) విచారం వ్యక్తం చేశారు. ఈ కాల్పులను "మాటల్లో చెప్పలేని విషాదం"గా అభివర్ణిస్తూ, స్థానిక అధికారులకు అవసరమైన ఏదైనా సహాయం అందించడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. కాగా, యునైటెడ్ స్టేట్స్‌లో సామూహిక కాల్పులు ఇటీవల సర్వసాధారణంగా మారాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు కనీసం 198 ఘటనలు చోటు చేసుకున్నట్లు గన్ వయోలెస్స్ (Gun Violence) అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

Dr Vivek Murthy: రోజుకి 15 సిగరెట్లు తాగడం కంటే కూడా.. అది చాలా ప్రమాదకరం.. విస్తుగొలిపే విషయాలు వెల్లడించిన భారతీయ సర్జన్ జనరల్..!

Updated Date - 2023-05-07T11:01:59+05:30 IST