California Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఆర్నెళ్ల చిన్నారి సహా ఆరుగురి మృతి..

ABN , First Publish Date - 2023-01-17T08:30:30+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో (America) మరోసారి కాల్పులు (Shooting) కలకలం రేపాయి.

California Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఆర్నెళ్ల చిన్నారి సహా ఆరుగురి మృతి..

కాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికాలో (America) మరోసారి కాల్పులు (Shooting) కలకలం రేపాయి. సోమవారం కాలిఫోర్నియాలోని (California) ఓ ఇంట్లో జరిగిన కాల్పుల్లో 6నెలల చిన్నారి సహా 6 మంది మృత్యువాత పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కాలిపోర్నియా రాష్ట్రం విసాలియా నగరంలో సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) ఈ కాల్పులు చోటు చేసుకున్నాయని. స్థానికంగా ఉండే ఓ ఇంట్లో బలవంతంగా చోరబడిన ఇద్దరు సాయుధులు కుటుంబ సభ్యులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు.

కాల్పుల శబ్ధం వినిపించడంతో చుట్టుపక్కల ఉండేవారు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో వెంటనే అక్కడికి వెళ్లిన తులారే కౌంటీ పోలీసులు ఆ ఇంట్లో ఐదు మృతదేహాలను గుర్తించారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఉండగా అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, చికిత్స పొందుతూ కొద్దిసేపటికే అతడు మృతిచెందాడని పోలీసులు చెప్పారు. కాగా, ఇది పూర్తిగా ఒక ఫ్యామిలీని టార్గెట్‌గా చేసుకుని కక్ష్యపూరితంగా జరిగిన కాల్పులేనని తులారే కౌంటీ పోలస్ అధికారులు అనుమానిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా ఇద్దరు నిందితులను పట్టుకుంటామన్నారు. ఇక మృతుల్లో ఓ తల్లితో పాటు 6 నెలల చిన్నారి ఉండడం అందరి హృదయాన్ని కలిచివేసింది.

Updated Date - 2023-01-17T08:34:21+05:30 IST