Share News

America: పోలీసుల నుంచి తప్పించుకోవాలనుకుని.. ఇళ్లన్నీ తగలబెట్టేశాడు.. అమెరికాలో భారీ అగ్నిప్రమాదం..!

ABN , First Publish Date - 2023-12-06T12:46:34+05:30 IST

Shocking Video: అగ్రరాజ్యం అమెరికా (Ameirca) లో తాజాగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి బీభత్సం సృష్టించాడు.

America: పోలీసుల నుంచి తప్పించుకోవాలనుకుని.. ఇళ్లన్నీ తగలబెట్టేశాడు.. అమెరికాలో భారీ అగ్నిప్రమాదం..!

Shocking Video: అగ్రరాజ్యం అమెరికా (Ameirca) లో తాజాగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తనను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి బీభత్సం సృష్టించాడు. ఇంకా చెప్పాలంటే అక్కడి స్థానికులకు సినిమాల్లోని బ్లాస్టింగ్ సీన్‌ కళ్లముందు కనిపించింది. వర్జీనియా రాష్ట్రం అర్లింగ్టన్ పరిధిలోని బ్లూమాంట్‌లో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్థానికంగా ఉండే ఓ వ్యక్తిపై సెర్చ్ వారెంట్ (Search Warrent) జారీ అయింది. దాంతో పోలీసులు ఆ వ్యక్తి ఆచూకీ తెలుసుకుని అతడు ఉంటున్న చోటుకి వెళ్లారు. అంతే.. తన కోసం పోలీస్ అధికారులు రావడం చూసిన నిందితుడు ఇంట్లోంచి కాల్పులు మొదలెట్టాడు. పోలీసులు వారించిన వినలేదు. అలా అతడు కాల్పులు జరపడంతో ఓ ఇల్లు పేలిపోయింది.

ఇది కూడా చదవండి: Viral: ఈ ఫొటోలోని మహిళ రెండు కాళ్లను ఎందుకు తీసేయాల్సి వచ్చిందో తెలిస్తే..!

సినిమాల్లో చూపించినట్లు పెద్ద శబ్ధంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు చుట్టుపక్కల ఇళ్లవారిని బయటకి రప్పించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇళ్లల్లో ఎవరు ఉండొద్దని, అందరూ బయటకు వచ్చేయాలని అలెర్ట్ చేశారు. కాగా, ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. ఇక పేలుడు కారణంగా చుట్టుపక్కల కొన్ని ఇళ్లు పాక్షికంగా ధ్వంసమైనట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే పరారీలో ఉన్న నిందితుడు కోసం గాలిస్తున్నామని చెప్పిన పోలీసులు.. వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఈ ఘటన తాలూకు వీడియో కాస్తా నెట్టింట ప్రత్యక్షం కావడంతో ఇప్పుడది వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Viral Video: ఇద్దరు పిల్లల మధ్య పదే పదే గొడవ.. ఒకే ఒక్క చిట్కాతో ఆ తల్లి ఎలా ఆపేసిందో చూస్తే కడుపుబ్బా నవ్వడం ఖాయం..!

  • మరిన్ని NRI NEWS కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-06T12:51:38+05:30 IST