యూకేలోని లండన్, కోవెంట్రీ నగరాల్లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2023-01-24T11:16:25+05:30 IST

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు లండన్ నగరం లోని హౌన్స్లో పట్టణంలో NRI TDP UK అధ్వర్యంలో ఘనంగా జరిగాయి.

యూకేలోని లండన్, కోవెంట్రీ నగరాల్లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు లండన్ నగరం లోని హౌన్స్లో పట్టణంలో NRI TDP UK అధ్వర్యంలో ఘనంగా జరిగాయి. NRI TDP UK ప్రెసిడెంట్ పోపూరి వేణు మాధవ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కోవెంట్రీ నగరంలో యూకె టీడీపీ వైస్ ప్రెసిడెంట్ చక్రి మొవ్వా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి నారా లోకేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నెల 27న ప్రారంభం కాబోతున్న 'యువగళం' పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ సంఘీభావంగా NRI TDP UK శ్రేణులు పట్టణంలో పాదయాత్ర నిర్వహించారు.

అనంతరం సభాకార్యక్రమంలో పలువురు ప్రవాసులు మాట్లాడారు. ' సైకో పోవాలి.. సైకిల్ రావాలి ' అనే నినాదంతో సభా ప్రాంగణం మార్మోగిపోయింది. ఈ కార్యక్రమం లో పలువురు ఎన్నారై టీడీపీ కార్యకర్తలు మాట్లాడుతూ రాష్ట్రంలో కూరుకుపోయిన అంధకారం తొలగిపోయి అభివృద్ధి బాటలో నడవాలంటే చంద్రబాబు మళ్ళీ సీఎం అవ్వాలని ,తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ యూకే నేతలు శ్రీకిరణ్ పరచూరి, ప్రసన్న నాదెండ్ల ,సురేష్ కోరం, శ్రీనివాస్ పాలడుగు, నవీన్ జవ్వాడి, సుందర్ రాజు మల్లవరపు, మేరీ కల్పన,భాస్కర్ అమ్మినేని, అమర్నాథ్ మన్నే , కుమార్ నిట్టల,లింగ రవితేజ, వంశి నాగళ్ళ , బాల కృష్ణ పోలినేని తదితరులు పాల్గొన్నారు.

NRI-TDP-2.jpg

Updated Date - 2023-01-24T11:16:27+05:30 IST