Kuwait: దేశవ్యాప్తంగా సెక్యూరిటీ సోదాలు.. 595 మంది ప్రవాసులు అరెస్ట్..!

ABN , First Publish Date - 2023-09-15T11:24:08+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గడిచిన కొంతకాలంగా ప్రవాసుల (Expats) పై ఉక్కుపాదం మోపుతోంది. వరుసగా తనిఖీలు నిర్వహిస్తున్న అక్కడి భద్రతాధికారులు ఉల్లంఘనలకు పాల్పడుతున్న వలసదారులను గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు.

Kuwait: దేశవ్యాప్తంగా సెక్యూరిటీ సోదాలు.. 595 మంది ప్రవాసులు అరెస్ట్..!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గడిచిన కొంతకాలంగా ప్రవాసుల (Expats) పై ఉక్కుపాదం మోపుతోంది. వరుసగా తనిఖీలు నిర్వహిస్తున్న అక్కడి భద్రతాధికారులు ఉల్లంఘనలకు పాల్పడుతున్న వలసదారులను గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు. అనంతరం వారిని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ (Interior Ministry) దేశం నుంచి బహిష్కరించడం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దేశవ్యాప్తంగా నిర్వహించిన సెక్యూరిటీ సోదాల్లో (Security searches) రెసిడెన్సీ వ్యవహారాల పరిశోధనల జనరల్ అడ్మినిస్ట్రేషన్ 595 మంది ప్రవాసులను అరెస్ట్ చేసినట్లు తాజాగా మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీరందరూ రెసిడెన్సీ, కార్మిక చట్టాల ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఈ సందర్భంగా సంబంధిత అధికారులు తెలిపారు.

ఖైతాన్, ఫర్వానియా, జలీబ్ అల్-షుయౌఖ్, అల్-అహ్మదీ, ముబారక్ అల్-కబీర్, హవాలీ, సాల్మియా, షువైఖ్ పారిశ్రామిక ప్రాంతం, మహాబౌలా, మంగాఫ్ తదితర ప్రాంతాలలో ఈ సోదాలు నిర్వహించినట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది. అంతేగాక ఈ సెక్యూరిటీ తనిఖీలు ఇకపై కూడా దేశంలోని వివిధ ప్రాంతాలలో ఇలాగే కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఇక అదుపులోకి తీసుకున్న ఉల్లంఘనదారులను (Violators) సంబంధిత అధికారులకు అప్పగించడంతో పాటు తగిన చట్టపరమైన చర్యలు (Legal Measures) తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు.

Kuwait: కొత్త వర్కింగ్ అవర్స్‌కు కువైత్ ఆమోదం.. ఇకపై ఉద్యోగులు..


Updated Date - 2023-09-15T11:24:08+05:30 IST