Breast Pumps : బ్రెస్ట్ పంప్స్ గురించి పాలిచ్చే తల్లుల్లో ఎంత వరకూ అవగాహన ఉంది..!

ABN , First Publish Date - 2023-03-20T15:09:14+05:30 IST

చాలామంది మహిళలు బిడ్డలకు చనుబాలు తాగించాలనే ఉద్దేశ్యంతో ఉంటారు కానీ,

Breast Pumps : బ్రెస్ట్ పంప్స్ గురించి పాలిచ్చే తల్లుల్లో ఎంత వరకూ అవగాహన ఉంది..!
Breastmilk

పాలిచ్చే తల్లులకు ఇదో సౌకర్యవంతమైన ఆవిష్కరణ. గదిలో తలుపులు వేసుకుని నలుగురికి కనిపించకుండా తల్లి పాలివ్వడం అనేది ఒకప్పుడు జరిగేది. నేటి పరుగుల కాలంలో ఉద్యోగాలకు హాజరయ్యే తల్లులు తమ బిడ్డలకు పాలివ్వాలంటే ఇలాంటి పరికరాల సహాయం తప్పనిసరైపోతుంది. ఈ ప్రక్రియను సులభంగా, సౌకర్యవంతంగా మార్చాలనే ఆలోచనే బ్రెస్ట్ పంప్.

ఇప్పటి హాస్పిటల్స్‌లో, కొత్త తల్లుల కోసం బ్రెస్ట్ పంపింగ్ మిషన్స్ అందుబాటులో ఉంటున్నాయి. ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్, ఇది కాంపాక్ట్, ట్యూబ్ లెస్ , బ్రా లోపల దాచి ఉంచవచ్చు. సాంప్రదాయ రొమ్ము పంప్‌ని ఉపయోగించాల్సిన ప్రతిసారీ మూసి తలుపుల వెనుక కూర్చోవాల్సి రావడంతో విసుగు చెంది, ప్రతి తల్లికి ఇబ్బందికరంగా ఉండకుండా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ విధానాలు ఉపయోగపడుతున్నాయి.

తల్లి పాలు శిశువుకి అమృతం వంటివి. తల్లి పాలివ్వడం అనేది తల్లి జీవితంలో సంతోషకరమైన అనుభవాలలో ఒకటి. ఇది శిశువుకు పూర్తి పోషణను అందించడమే కాక, పిల్లలకి, తల్లికి మధ్య విడదీయరాని బంధాన్ని ఏర్పరుస్తుంది. అయితే కొన్ని కారణాల వల్ల బిడ్డలు తల్లికి దూరం అవుతుంటారు, అలాంటి పిల్లలకి తల్లి పాలు అనేవి అందవు. ఇంకా కొన్ని సందర్భాలలో తల్లి తన బిడ్డకి కూడా పాలు ఇవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉంటది. ఇలాంటి సమస్యలకి పరిష్కారంగా బ్రెస్ట్ పంపింగ్ మిషన్స్ అందుబాటులో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: ఏది తిన్నా ఎసిడిటి వేధిస్తుందా? ఈ హోం రెమెడీస్‌తో ఎసిడిటికి గుడ్‌బై చెప్పేయండి మరి..!

మహిళలు పలు కారణాలతో బ్రెస్ట్ పంప్ లు ఉపయోగిస్తున్నారు. చాలామంది మహిళలు బిడ్డలకు చనుబాలు తాగించాలనే ఉద్దేశ్యంతో ఉంటారు కానీ, ఉద్యోగం రీత్యానో లేదా ఏవైనా పనులకారణంగానో బిడ్డలను ఇంట్లో వదిలి వెళ్లవలసి ఉంటుంది, అటువంటి వారు తిరిగి ఇంటికి వెళ్లినప్పుడు చనుబాలను ఇవ్వవచ్చని వీలు కుదిరినప్పుడు బ్రెస్ట్ పంప్ ఉపయోగించి పాలను తీసిపెట్టుకుంటారు, తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తమ బిడ్డలకు ఈపాలను తాగిస్తున్నారు.

Updated Date - 2023-03-20T15:09:14+05:30 IST