Foods to Eat and Avoid: మద్యం తాగేముందు., తరువాత తినకూడని ఆహార పదార్థాల గురించి మీకు తెలుసా.. ఆ జాగ్రత్తలు తీసుకోండి లేదంటే..!

ABN , First Publish Date - 2023-05-18T16:44:19+05:30 IST

ఆల్కహాల్ తాగేటప్పుడు చాక్లెట్, కెఫిన్ లేదా కోకో వంటి వాటికి దూరంగా ఉండాలి,

Foods to Eat and Avoid: మద్యం తాగేముందు., తరువాత తినకూడని ఆహార పదార్థాల గురించి మీకు తెలుసా.. ఆ జాగ్రత్తలు తీసుకోండి లేదంటే..!
Health News

మద్యాన్ని సరదాగా, స్నేహితులు, ఆత్మీయులతో కలిసి పంచుకునే సమయంలో ఎటువంటి పదార్థాలను మధ్యంతో కలిపి తీసుకోవచ్చో వీటి గురించి మీకు ఎంతవరకూ తెలుసు. సాధారణంగా చాలామంది మద్యం తాగేటప్పుడు వేరుశెనగ లేదా జీడిపప్పును తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే మద్యం సేవించే సమయంలో ఈ పదార్థాలను దూరం పెట్టాలని నిపుణులు అంటున్నారు.. ఇవి తినడం వల్ల శరీరంలో అధిక కొలెస్ట్రాల్ పెరిగి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని వారు అంటున్నారు. అంతేకాకుండా మద్యం సేవించే సమయంలో తీపి పదార్థాలను కూడా దూరం పెట్టాలని, సోడా కూల్ డ్రింక్ వంటివి కలుపుకొని తాగితే నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఆల్కహాల్ తాగేటప్పుడు తినడానికి రుచికరమైన ఆహారాలతో పాటు తినకూడనివి కూడా ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆల్కహాల్ చేసే నష్టం కన్నా ఈ పదార్థాలు చేసే నష్టం అధికంగా ఉంటుందట అవేమిటంటే..

మద్యం సేవించే సమయంలో తినవలసిన, తినకుండా ఉండవలసిన ఆహారాల గురించి..

యాపిల్స్, ఇతర పండ్లు

పండ్లలో అధిక మొత్తంలో నీరు ఉంటుంది, ఇది ఆల్కహాల్‌ను కరిగించడంలో సహాయపడుతుంది. యాపిల్స్ ఆల్కహాల్ తాగడం వల్ల పేగుల వాపును తగ్గించడంలో సహాయపడతాయి.

గుడ్లు

గుడ్లలో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది, ఇది ఆల్కహాల్ అరుగుదలను మందగించడంలో సహాయపడుతుంది. కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది.

సాల్మన్

సాల్మన్ ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల అద్భుతమైన మూలం., ఇది ప్రోటీన్‌తో నిండి ఉంటుంది. మద్యపానం వల్ల మెదడు వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

గింజలు

ఆల్కహాల్‌తో పాటు గింజల్ని తింటూ ఉంటారు. ఇందులో అధిక కొవ్వు కంటెంట్ ఉంటుంది, ఇది ఆల్కహాల్ అరుగుదలను నెమ్మదిస్తుంది.

పాల ఉత్పత్తులు

ఆల్కహాల్ తాగేటప్పుడు చాక్లెట్, కెఫిన్ లేదా కోకో వంటి వాటికి దూరంగా ఉండాలి, ఎందుకంటే అవి ఇతర ఆమ్ల ఆహారాలు కావడం వల్ల గ్యాస్ట్రో సమస్యలను తీవ్రతరం చేస్తాయి.

ఇది కూడా చదవండి: విడాకులకు ప్రేమ పెళ్ళళ్ళే కారణమా..!

పిజ్జా

పిజ్జా రాత్రిపూట మద్యపానం చేసేవారికి ఇష్టమైన ఆహారం, అయితే, మద్యం సేవించే సమయంలో పిజ్జా తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంది.

ఉప్పు ఆహారం

నాచోస్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ఉప్పగా ఉండే ఆహారాన్ని ఆల్కహాల్ తో కలిపితీసుకోవడం మానేయండి, ఎందుకంటే ఇందులోని సోడియం అధిక మొత్తంలో ఉండి, జీర్ణక్రియకు ఇబ్బంది కలిగిస్తుంది.

బీన్స్

తాగేటప్పుడు బీన్స్ కాయధాన్యాలు తినడం మానుకోవాలి. ఎందుకంటే ఇందులో అధిక మొత్తంలో ఇనుము ఉంటుంది, ఇది శరీరం బాగా గ్రహించదు.

Updated Date - 2023-05-18T16:44:19+05:30 IST