Frequent Urination: రోజుకు ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేస్తున్నారు..? ఆ లిమిట్ దాటితే వీటిల్లో ఏదో ఒకటి కారణం కావచ్చు..!

ABN , First Publish Date - 2023-05-26T14:50:03+05:30 IST

కడుపులో బిడ్డ పెరుగుతున్న సమయంలో మూత్రాశయం మీద ఒత్తిడి పెరుగుతుంది.

Frequent Urination: రోజుకు ఎన్నిసార్లు మూత్ర విసర్జన చేస్తున్నారు..? ఆ లిమిట్ దాటితే వీటిల్లో ఏదో ఒకటి కారణం కావచ్చు..!
Nerve related problems

కాస్త ఎక్కువ నీరు తాగినా, చల్లని వాతావరణం ఉన్నా అతి మూత్ర విసర్జనతో ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్య చాలామందిలో కనిపిస్తుంది. కాకాపోతే షుగర్ వ్యాధి గ్రస్తులు మరింత ఎక్కువ సార్లు బాత్రూమ్‌కి వెళ్ళే సమస్యను ఎదుర్కొంటారని చాలామందికి తెలుసు. కొందరు అనారోగ్య సమస్యల వల్ల రోజులో ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్తుంటారు. కొందరైతే రాత్రిపూట కూడా బాత్రూమ్‌కి అదే పనిగా తిరుగుతూ ఉంటారు. అయితే ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ ని సంప్రదించడం మంచిది. శరీరంలో టాక్సిన్స్ ను బయటకు విసర్జించే ప్రక్రియల్లో మూత్ర విసర్జన ఒకటి. రోజులో పదిసార్ల కంటే ఎక్కువ మూత్రవిసర్జన చేయాల్సి వస్తుందంటే మాత్రం కచ్చితంగా శరీర ఆరోగ్యంలో ఏదో మార్పు వచ్చిందని గుర్తించాలి.

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్

అతి మూత్ర విసర్జనతో బాక్టీరియా మూత్ర నాళంలోకి ప్రవేశించినపుడు అక్కడ ఇన్ఫ్లమేషన్ రావచ్చు. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ సోకినపుడు తరచుగా మూత్ర విసర్జన చెయ్యాలని అనిపించవచ్చు. అంతేకాదు మూత్ర విసర్జన నొప్పి లేదా మంటతో ఉంటుంది. ఈ సమస్యకు నీళ్ళు ఎక్కువగా తాగడం, నొప్పి తగ్గేందుకు మందులు వాడడం ద్వారా తగ్గించవచ్చు. కొన్ని సందర్భాల్లో యాంటీ బయాటిక్స్ అవసరం కూడా ఉండవచ్చు. పరిస్థితి కనుక తప్పకుండా డాక్టర్ ను సంప్రదించాలి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్‌కు చికిత్స తీసుకోకపోతే అది కిడ్నీ ఇన్ఫెక్షన్‌కు, సెప్సిస్‌కు కూడా దారి తియ్యవచ్చు.

డయాబెటిస్

రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటే రక్త శుద్ధికి కిడ్నీలు మరింత శ్రమించాల్సి వస్తుంది. అందువల్ల తరచుగా మూత్ర విసర్జన చెయ్యాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎక్కువ కార్బోహైడ్రేట్లు, చక్కెరలు వినియోగించే వారు ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేస్తుంటే మాత్రం టైప్ 2 డయాబెటిస్ కావచ్చని అనుమానించాల్సి వస్తుంది.

డయాబెటిస్ సమస్యలో మూత్రం ఒకరకమైన తీపి వాసన కూడా వస్తున్నట్టు అనిపిస్తుంది. చాలా మంది ఈ సమస్యను గుర్తించడంలో జాప్యం చేస్తుంటారు. ఎందుకంటే ఈ సమస్యలో చాలా చిన్న చిన్న లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. వీటిని విస్మరిస్తుంటారు. తప్పకుండా డాక్టర్ సూచించిన పరీక్షలు చేయించుకుంటూ మందులు వాడాలి. జీవన శైలిలో మార్పుల కూడా డయాబెటిస్‌లో తప్పనిసరి. దీనికి చికిత్స అందించకపోతే గుండె, కిడ్నీ వంటి ముఖ్యమైన అంతర్గత అవయవాలన్నీ దెబ్బతినవచ్చు. కొన్నిసార్లు ప్రాణాపాయానికి కారణం కూడా కావచ్చు.

స్ట్రోక్

స్ట్రోక్ అనేది రక్తప్రసరణకు అవరోధం కలగడం, నరాలు చిట్లడము వల్ల సంభవించే వైద్య అత్యవసర పరిస్థితి, అంటే మెదడుకు ఆక్సిజన్, పోషకాలను తీసుకెళ్లే రక్తనాళాలు చిట్లి పోవడం, రక్త సరఫరాకు అంతరాయం ఏర్పడటం తత్ఫలితంగా మెదడులోని ఒక భాగానికి ఆక్సిజన్ అంతరాయం కలిగించడం వల్ల ఆ భాగంలో కణాలు చనిపోవచ్చు. మెదడులో మూత్రాశయాన్ని నియంత్రించే నాడులు స్ట్రోక్ వల్ల ప్రభావితం అయినపుడు తరచుగా మూత్ర విసర్జన చెయ్యాల్సి రావచ్చు. ఒక్కోసారి మూత్ర నియంత్రణా సామర్థ్యం కూడా తగ్గిపోవచ్చు. స్ట్రోక్‌కు వీలైనంత త్వరగా చికిత్స తీసుకోవడం అవసరం. కొన్ని‌సార్లు ఆపరేషన్స్ కూడా అవసరమవుతుంది.

ఇది కూడా చదవండి: గుడికి వెళ్లినప్పుడు చెప్పులు పోతే దురదృష్టమా..? ఈ డౌట్ ఉన్నవాళ్లు ఇది చదవండి..!

లైంగిక సంక్రమణలు

క్లామిడాయా, గోవెరియా అత్యంత సాధారణంగా లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లు. మూత్ర విసర్జన సమయంలో మూత్రం తెల్లగా, చిక్కగా కనిపించినా, దుర్వాసన వేస్తున్నా, లైంగిక సంక్రమణగా అనుమానించాలి. ఈ సమస్యకు వైద్య పరీక్షలు అవసరం. నాడీ సంబంధ సమస్యలు, వంధ్యత్వం, తల్లి నుంచి బిడ్డకు సంక్రమించడం, పుట్టుకతో లోపాలున్న బిడ్డలు కలగడం వంటి తీవ్రమైన పరిస్థితులు ఎదురుకావచ్చు.

మూత్రాశయ క్యాన్సర్

మన మూత్రాశయంలో కణితి ఏర్పడినపుడు ఈ పరిస్థితి మూత్ర విసర్జన ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. మూత్రాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్న వారిలో తరచుగా మూత్ర విసర్జన చెయ్యాల్సి రావచ్చు. మూత్ర విసర్జనలో నొప్పి కూడా అనిపించవచ్చు. ఇలాంటి సందర్భంలో వీలైనంత త్వరగా డాక్టర్‌ను సంప్రదించి చికిత్స ప్రారంభించడం అత్యవసరం.

ప్రెగ్నెన్సీ

కడుపులో బిడ్డ పెరుగుతున్న సమయంలో మూత్రాశయం మీద ఒత్తిడి పెరుగుతుంది కనుక తరచుగా మూత్రవిసర్జన చెయ్యాల్సి రావచ్చు. హార్మోన్లలో వచ్చే మార్పులు కూడా మూత్ర విసర్జన మీద ప్రభావాన్ని చూపుతాయి. గర్భిణీలు తరచుగా డాక్టర్‌ను సంప్రదించి సమయానుసారం సలహాలు తీసుకోవడం అవసరం.

Updated Date - 2023-05-26T14:53:32+05:30 IST