Cow Milk vs Buffalo Milk: ఆవు పాలు మంచిదా..? గేదె పాలను వాడటం మంచిదా..? ఆరోగ్యానికి అసలు ఏది బెస్ట్ అంటే..!
ABN , First Publish Date - 2023-07-01T16:41:50+05:30 IST
అధిక కొలెస్ట్రాల్ స్థాయి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. దీనికి సరైనా ఆహారాన్ని ఎంచుకోవడం అవసరం. రోజూ ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకూ మనం తీసుకునే ఆహారంలోని పోషకాలతోనే చక్కని ఆరోగ్యం పొందగలుగుతాం. నిజానికి చిన్నపిల్లల నుంచి పెద్దలవరకూ తమ రోజు మొదలు పెట్టేది పాలతోనే. ఇవి గేదెపాలా, లేక ఆవు పాలా అనేది వాటిలోని పోషకాలను బట్టి తీసుకోవాలి. అసలు ఈ రెంటిలో ఏ పాలు ఆరోగ్యానికి మంచివనేది తెలుసుకోవాలి.
ఆవు పాలు ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తూ ఉంటాం, ఇవి మనకు ఆరోగ్యకరమైనవి. ఇందులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ D, విటమిన్ B12 వంటి పోషకాలున్నాయి. బలమైన ఎముకలు, కండరాల పెరుగుదల, మొత్తం ఆరోగ్యానికి ఈ పోషకాలు అవసరం. పోషక విలువలు, ప్రయోజనాల కారణంగా ఆవు పాలను గేదె పాలకు ఆరోగ్యకరమైనవి. అసలు పాలను వేటిని ఎంచుకోవాలి అనే అయోమయంలో ఉంటే, ఆవు పాలు లేదా గేదె పాలు తాగడం ప్రయోజనకరమా అనేది తెలుసుకుందాం.
1. పోషక కూర్పు
సమతుల్య పోషక కూర్పు కారణంగా, గేదె పాల కంటే ఆవు పాలు ఎక్కువ ప్రయోజనకరం. ఇవి ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్ల సమతుల్యతను కలిగి ఉంటాయి. ఆవు పాలలో గేదె పాలు కంటే తక్కువ కొవ్వు పదార్ధం ఉంటుంది, ఇది బరువు పెరుగుతున్నామని ఆందోళన చెందుతున్న వారికి సరైనది.
ఇది కూడా చదవండి: తగ్గడానికి డైట్ చేస్తోంటే.. తేడాలొచ్చి బరువు అమాంతం పెరుగుతోంటే.. ఈ 6 అంశాలతో ముందే గుర్తించొచ్చు..!
2. జీర్ణ శక్తి
గేదె పాల కంటే ఆవు పాలు సులభంగా జీర్ణమవుతాయి. ఆవు పాలలో ఉండే కొవ్వు గ్లోబుల్స్ పరిమాణంలో చిన్నవి, ఇవి జీర్ణక్రియకు సహాయపడతాయి. గేదె పాలలో కొవ్వు గ్లోబుల్స్ పెద్దవిగా ఉంటాయి, ఇది జీర్ణం కావడం కష్టతరం చేస్తుంది, ముఖ్యంగా లాక్టోస్ అసహనం వంటి జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఆవుపాలు మంచివి.
3. తక్కువ కొలెస్ట్రాల్ స్థాయి
ఆవు పాలలో గేదె పాల కంటే తక్కువ కొలెస్ట్రాల్ ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్ స్థాయి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే అధిక కొలెస్ట్రాల్ స్థాయి ఉన్నవారు గేదె పాలకు బదులుగా ఆవు పాలను తీసుకోవడం వల్ల మంచిది.
4. అధిక విటమిన్ కంటెంట్
గేదె పాల కంటే ఆవు పాలలో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. మంచి కంటి చూపు, ఎముకల పెరుగుదల, ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు విటమిన్ ఎ అవసరం. కాబట్టి, ఆవు పాలను తీసుకోవడం వల్ల విటమిన్ ఎ మెరుగైన మోతాదులో లభిస్తుంది.