Delhi: జమిలీ ఎన్నికల కమిటీ ఫస్ట్ మీటింగ్‌.. చర్చించనున్న అంశాలివే

ABN , First Publish Date - 2023-09-23T09:54:17+05:30 IST

జమిలీ(Jamili Elections) ఎన్నికల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఇందుకోసం ఏర్పాటు చేసిన ఎన్నికల కమిటీ ఫస్ట్ మీటింగ్ సెప్టెంబర్ 23న ఢిల్లీలో జరగనుంది.

Delhi: జమిలీ ఎన్నికల కమిటీ ఫస్ట్ మీటింగ్‌.. చర్చించనున్న అంశాలివే

ఢిల్లీ: జమిలీ(Jamili Elections) ఎన్నికల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి ఇందుకోసం ఏర్పాటు చేసిన ఎన్నికల కమిటీ ఫస్ట్ మీటింగ్ సెప్టెంబర్ 23న ఢిల్లీలో జరగనుంది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్(Ramnath Kovind) నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. లోక్ సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడానికి రోడ్ మ్యాప్ సిద్ధం కానుంది.


ఇందులో భాగంగా పొలిటికల్ పార్టీలు, నిపుణుల సలహాలు, సూచనలు ఈ కమిటీ తీసుకోనుంది. జమిలి ఎన్నికల కమిటీ ఛైర్మన్ గా మాజీ రాష్టప్రతి రాం నాథ్ కోవింద్, సభ్యులుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amith Shah), కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు గులాం నబీ ఆజాద్(Gulamnabi Aajad), ఫైనాన్స్ కమిషన్ మాజీ చైర్మన్ ఎన్ కే సింగ్, లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ సి.కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ సీవీసీ సంజయ్ కొఠారి ఉన్నారు. ఒకే దేశం - ఒకే ఎన్నిక విధానాన్ని అమల్లోకి తేవడానికి కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఒడిశా పర్యటనలో ఉన్న రాంనాథ్ కోవింద్ నిన్న ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

Updated Date - 2023-09-23T09:55:34+05:30 IST