Womens Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రత్యేకతలివే..

ABN , First Publish Date - 2023-09-19T15:41:42+05:30 IST

మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘావల్ ఇవాళ లోక్ సభలో ప్రవేశపెట్టారు. కేంద్రం ఈ బిల్లుకి నారీ శక్తి వందన్ అభియాన్ అనే పేరు పెట్టింది. కానీ 2027 తర్వాతే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే చట్ట సభల్లో మహిళా సభ్యుల సంఖ్య 180 స్థానాలకు పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. కేంద్రం తీసుకువస్తున్న ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రత్యేకతలివే..

Womens Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రత్యేకతలివే..

మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘావల్ ఇవాళ లోక్ సభలో ప్రవేశపెట్టారు. కేంద్రం ఈ బిల్లుకి నారీ శక్తి వందన్ అభియాన్ అనే పేరు పెట్టింది. కానీ 2027 తర్వాతే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే చట్ట సభల్లో మహిళా సభ్యుల సంఖ్య 180 స్థానాలకు పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. కేంద్రం తీసుకువస్తున్న ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రత్యేకతలేంటో చూద్దాం..


1) చట్ట సభల్లో మహిళల రిజర్వేషన్‌ను ఈ బిల్లు తప్పనిసరి చేస్తుంది. తాజా సవరణ ప్రకారం లోక్‌సభలోని మూడింట ఒక వంతు మహిళలకు సీట్లు రిజర్వ్ చేస్తారు. తద్వారా చట్ట సభలో మహిళల ప్రాధాన్యత పెరుగుతుంది.

2) దేశ రాజధాని ఢిల్లీ శాసనసభకూ బిల్లు నిబంధనలు వర్తిస్తాయి. ఎస్సీ రిజర్వ్‌డ్ సీట్లలో మూడింత ఒక వంతు మహిళలకు కేటాయిస్తారు. ఈ విషయాన్ని అందులోని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.

3)ఢిల్లీతో పాటు అన్నిరాష్ట్రాల శాసన సభలకు ఈ బిల్లు వర్తిస్తుంది. షెడ్యూల్డ్ కులాలు, తెగల వారి రిజర్వేషన్లతో పాటు మహిళలకు మూడింత ఒక వంతు సీట్లు రిజర్వ్ చేసి ఉంటాయి.

4) రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగంలో 128వ సవరణ చేశాక జనగణన ప్రారంభించనున్నట్లు కేంద్ర పెద్దలు చెబుతున్నారు. జనగణన అయ్యాకే 2027 తర్వాత బిల్లు చట్ట రూపం దాల్చుతుందని స్పష్టం చేశారు.

Updated Date - 2023-09-19T15:41:42+05:30 IST