Karnataka Assembly Elections: ఒకే స్థానం నుంచి బరిలోకి దిగిన కర్ణాటక మాజీ సీఎం బంగారప్ప తనయులు

ABN , First Publish Date - 2023-04-13T21:41:36+05:30 IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) ఒకే స్థానం నుంచి ఇద్దరు అన్నదమ్ములు పోటీపడుతున్నారు.

Karnataka Assembly Elections: ఒకే స్థానం నుంచి బరిలోకి దిగిన కర్ణాటక మాజీ సీఎం బంగారప్ప తనయులు
Sons of former Karnataka CM late S Bangarappa

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) ఒకే స్థానం నుంచి ఇద్దరు అన్నదమ్ములు పోటీపడుతున్నారు. కర్ణాటక మాజీ సీఎం బంగారప్ప(former Karnataka Chief Minister late S Bangarappa) తనయులు కుమార్ బంగారప్ప(Kumar Bangarappa), మధు బంగారప్ప(Madhu Bangarappa) శివమొగ్గ(Shivamogga) జిల్లాలోని సొరబ నియోజకవర్గం (Soraba constituency) నుంచి పోటీపడుతున్నారు. కుమార్ బంగారప్ప భారతీయ జనతా పార్టీ (BJP) నుంచి బరిలోకి దిగుతుండగా మధు కాంగ్రెస్(Congress) పార్టీనుంచి పోటీపడుతున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో తమ్ముడు మధుపై కుమార్ 3వేలకు పై చిలుకు ఓట్లతో గెలుపొందారు.

కన్నడ సినీరంగంలో కూడా ఇద్దరికీ ప్రవేశం ఉంది. ఎన్నికల వేళ పరస్పరం విమర్శించుకోవడంలో కూడా పోటీపడ్తుంటారు. కుమార్ గతంలో సొరబ నుంచి మూడు సార్లు గెలిచారు. మధు ఒకసారి గెలిచారు. తాజా ఎన్నికల్లో గెలుపు కోసం ఇద్దరూ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నారు.

మరోవైపు బీజేపీ ఇప్పటికే రెండొందల మందికి పైగా అభ్యర్థులను ప్రకటించింది. సీఎం బసవరాజ్‌ బొమ్మై, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప తనయుడు బీవై విజయేంద్ర పేర్లు కూడా ఉన్నాయి. 52 మంది కొత్త అభ్యర్థులకు అవకాశమిచ్చారు. 8 మంది మహిళలకు చోటిచ్చారు. 189 టికెట్లలో 32 ఓబీసీలకు, 30 ఎస్సీలకు, 16 ఎస్టీలకు ఇచ్చారు. వరుణలో సిద్దూతో మంత్రి వి.సోమన్న తలపడనున్నారు. అలాగే కనకపురలో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై మరో మంత్రి ఆర్‌.అశోక బరిలోకి దిగనున్నారు. ఇక సీఎం బొమ్మై తన సొంత నియోజకవర్గం శిగ్గావ్‌లో, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి చిక్‌మగళూర్‌లో, రాష్ట్ర మంత్రి బి.శ్రీరాములు బళ్లారి రూరల్‌లో, గాలి జనార్దనరెడ్డి సోదరుడు గాలి సోమశేఖర్‌రెడ్డి బళ్లారి సిటీలో బరిలోకి దిగనున్నారు. హిజాబ్‌ వివాదం తలెత్తిన ఉడుపిలో ప్రస్తుత ఎమ్మెల్యే రఘుపతి భట్‌ స్థానంలో యశ్‌పాల్‌ సువర్ణకు అవకాశమిచ్చారు.

కాంగ్రెస్ ఇప్పటివరకూ 165 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. జేడీఎస్ 97 మంది అభ్యర్థులతో జాబితా ప్రకటించింది.

కర్ణాటక (Karnataka)లో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

Updated Date - 2023-04-17T22:15:32+05:30 IST