Sanjay Raut : షిండే ప్రభుత్వం 15 రోజుల్లో కుప్పకూలుతుంది : సంజయ్ రౌత్

ABN , First Publish Date - 2023-04-23T14:54:22+05:30 IST

ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వానికి డెత్ వారంట్ జారీ అయిందని, ఆ ప్రభుత్వం రానున్న 15 లేదా

Sanjay Raut : షిండే ప్రభుత్వం 15 రోజుల్లో కుప్పకూలుతుంది : సంజయ్ రౌత్
Eknath Shinde, Sanjay Raut

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వానికి డెత్ వారంట్ జారీ అయిందని, ఆ ప్రభుత్వం రానున్న 15 లేదా 20 రోజుల్లో కుప్పకూలిపోబోతోందని శివసేన (యూబీటీ) (Shiv Sena (UBT) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) చెప్పారు. తమ పార్టీ కోర్టు ఆదేశాల కోసం చూస్తోందని, న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు రావలసి ఉన్న సంగతి తెలిసిందే. దీని గురించే ఆయన ప్రస్తావించారు.

సంజయ్ రౌత్ ఆదివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ‘‘ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆయన వెంటగల 40 మంది ఎమ్మెల్యేలతో కూడిన ప్రభుత్వం 15-20 రోజుల్లో కుప్పకూలిపోబోతోంది. ఈ ప్రభుత్వానికి డెత్ వారంట్ జారీ అయింది. దీని మీద ఎవరు సంతకం చేస్తారో నిర్ణయించవలసి ఉంది’’ అని చెప్పారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ, షిండే నేతృత్వంలోని ప్రభుత్వం ఫిబ్రవరిలో కూలిపోతుందని చెప్పిన సంగతి తెలిసిందే.

ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన నుంచి షిండే, మరో 39 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి, ఆ పార్టీని వీడటంతో గత ఏడాది జూన్‌లో కాంగ్రెస్-ఎన్‌సీపీ-శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఆ తర్వాత బీజేపీ మద్దతుతో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం ఏర్పాటైంది. 2022 జూన్ 30న షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవీస్ (బీజేపీ) ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఉద్ధవ్ థాకరే, ఏక్‌నాథ్ షిండే వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వు చేసింది.

ఇవి కూడా చదవండి :

Satyapal Malik VS Amit shah: సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యలపై తొలిసారి స్పందించిన అమిత్‌షా

Airport: విమానాశ్రయం కొత్త టెర్మినల్‌లో ట్రయల్‌ రన్‌ సక్సెస్‌

Updated Date - 2023-04-23T14:54:22+05:30 IST